మంచాల, జనవరి 31 : వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతువేదికలు నేడు నిరుపయోగంగా మారుతున్నాయి. లక్షలాది రూపాయలతో ఏర్పా టైన వాటి లక్ష్యం నెరవేరడం లేదు. మండలంలోని ఆరుట్ల రైతు వేదికలో కొన్ని రోజులుగా వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో సమస్యలు ఎవరికీ చెప్పుకోవాలో రైతులకు తెలియడంలేదని బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పున్నం రాము పేర్కొన్నారు.
రైతుల గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. కాగా శుక్రవారం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అధికారులు కూర్చునే కుర్చీకి బీఆర్ఎస్ నాయకులు మహేందర్, జానీపాషా, జంగయ్య, వెంకటేశ్, శ్రీ కాంత్, రాజు, బాల్రాజ్, రాము, వేణులతో కలిసి రాము అందజేశారు.