రంగారెడ్డి, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : షాబాద్‌లో ఏర్పాటు చేసిన రైతు దీక్షకు అపూర్వ స్పందన లభించింది. దీనికి జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు వేలాదిగా తరలివచ్చారు. హామీల అమల్లో ప్రభుత్వ తీరును ఎండగట్టడం.. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే ఉద్యమాల్లో భాగంగా మొదటిసారిగా రంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభించిన నిరసన దీక్ష సక్సెస్ అయింది. యువ నాయకుడు పట్నం అవినాశ్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కార్తీక్‌రెడ్డి ఏర్పాట్లు వాహ్ అనిపించారు. జేసీబీల సహాయంతో కేటీఆర్ ర్యాలీపై పూలవ ర్షం కురిపించారు. ఈ సందర్భంగా షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డిని కేటీఆర్ అభినందించారు.
తరలివచ్చిన రైతులు
రైతు దీక్షకు జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహేశ్వరం సెగ్మెంట్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో.. చేవెళ్ల సెగ్మెంట్ నుంచి అవినాశ్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో..ఇబ్రహీంప ట్నం సెగ్మెంట్ నుంచి మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, క్యామ మల్లేశ్ ఆధ్వర్యంలో.. షాద్‌నగర్ సెగ్మెంట్ నుంచి మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు భారీగా హాజరయ్యా రు. అలాగే, కొడంగల్ సెగ్మెంట్ నుంచి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో.. పరిగి, వికారాబాద్ సెగ్మెంట్ల నుంచి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, ఆనంద్ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చారు.
జేసీబీలతో పూల వర్షం..
రైతు దీక్షకు హాజరైన కేటీఆర్‌కు ఘనస్వాగతం లభించింది. సుమారు 30 జేసీబీలతో ఆయన ర్యాలీపై పూలవర్షం కురిపించారు. జేసీబీల బొక్కెనలను పైకిలేపి అందులో నుం చి దారి పొడవునా పూలవర్షం కురిసింది. ఈ పూల వర్షాన్ని ..స్వాగత ఏర్పాట్లను చూస్తుం టే తాను నిరసన దీక్షకు హాజరైనట్లు లేదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా ఇంటికి పంపించాలో అనే కసి, ఆత్రుత ప్రజల్లో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తున్నదని కేటీఆర్ పేర్కొన్నారు.
కొత్త ఉత్సాహం..
షాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన రైతు దీక్ష జిల్లా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీక్షకు హాజరైన మాజీ మం త్రులు సబితాఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఇతర మాజీ ఎమ్మెల్యేలు చేసిన ప్రసంగం రైతులు, బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్‌ను తీసుకొచ్చింది. ఈ సందర్భం గా రైతు దీక్షకు హాజరైన పలువురు రైతులతో కేటీఆర్ ముఖాముఖి మాట్లాడారు. రుణమా ఫీ, రైతుభరోసా, మహిళలకు రూ. 2500 ఆర్థిక సాయం, 200 యూనిట్ల ఉచి త విద్యుత్, రూ. 500లకు సిలిండర్ వంటి పథకాలు ఎక్కడా అమలు కావడంలేదని, కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని పలువురు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. హామీలను అమలు చేయాలని కోరితే అక్రమంగా జైళ్లలో నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు.
ఓట్ల కోసం వచ్చే నాయకులను నిలదీయండి
అలవి కాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం గ్రామాల్లోకి వస్తే నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. త్వరలోనే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు రానున్నాయని.. ఈ ఎన్నికల్లో ఓట్లకోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు హామీలు అమలు చేసిన తర్వాతే తమ వద్దకు రావాలని స్పష్టంగా చెప్పాలని సూచించారు.
మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాలి
పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా మొక్కవోని ధైర్యంతో ప్రతి కార్యకర్తా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం షాబాద్‌లో నిర్వహించిన రైతుదీక్ష కార్యక్రమానికి మాజీ మంత్రులు సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌రెడ్డి, శంభీపూర్ రాజుతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్ వెళ్తుండగా.. మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణు లు వారికి ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ మండల కేంద్రానికి రాగానే జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ అనే నినాదాలు మార్మోగాయి. ఈ సందర్భంగా కేటీఆర్‌కు పార్టీ శ్రేణులు శాలువాలు కప్పి.. పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. పటాకులు కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అదేవిధంగా మండల కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించడం తోపాటు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం పార్టీ నేతలు, నాయకులతో మాట్లాడుతూ.. ఇంత అభిమానాన్ని చూపిన మీకు ప్రత్యేక అభినందనలన్నీ పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో నిలబడితే రానున్న రోజుల్లో మనదే రాజ్యం అని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, బీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, జయవంత్, వెంకట్‌రెడ్డి, గణేశ్‌రెడ్డి, నర్సింహాగౌడ్, రాము, జగన్మోహన్రెడ్డి, చైర్మన్లు వెంకట్‌రెడ్డి, రవూఫ్, రాజు, సుధాకర్‌యాదవ్, రాఘవరెడ్డి, మహేందర్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రవియాదవ్, సురేందర్‌గౌడ్, అంజిరెడ్డి, షేక్ మహబూబ్, అంజయ్యగౌడ్, రాంచందర్, తిరుపతిరెడ్డి, బాల్‌రాజ్, ప్రవీణ్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, సత్తిరెడ్డి, చిన్న, పరమేశ్, ప్రవీణ్, బాలు, అరవింద్, వెంకటేశ్, దేవిడ్, కిరణ్, సునీల్, భాస్కర్, ఓంప్రకాశ్‌గౌడ్, శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, మల్లేశ్, దర్శన్, శ్రీరాములు, షరీఫ్ పాల్గొన్నారు.