పెండింగ్ బకాయిలు చెల్లించాలని రోడ్డెక్కిన రైతన్న
రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్న డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ రవీందర్‌యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం కేశంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట మెరుపు ధర్నా నిర్వహించారు.
- మొక్కజొన్న డబ్బులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్
కేశంపేట : రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్న డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ రవీందర్‌యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం కేశంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట మెరుపు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులు పండించిన మొక్కజొన్న పంటను రెండు నెలల కిందట సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి.. ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదన్నారు. పంటను అప్పులు చేసి అన్నదాతలు సాగు చేశారని.. డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మండలంలో 561 మంది రైతులకు దాదాపు రూ.6 కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలన్నారు.
నాలుగు రోజుల్లో డబ్బులు చెల్లించకుంటే మండల కేంద్రంలో మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, షాద్‌నగర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్, పీఏసీఎస్ కొత్తపేట మాజీ చైర్మన్ జగదీశ్వర్‌గౌడ్, మాజీ వైస్ చైర్మన్ అంజిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు వేణుగోపాల్‌చారి, రాజు, రమేశ్‌యాదవ్, మాజీ సర్పంచ్‌లు నవీన్‌కుమార్, వెంకట్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ మల్లేశ్‌యాదవ్, నాయకులు సురేందర్, పర్వత్‌రెడ్డి, అశోక్, జమాల్‌ఖాన్, సాజిద్, జగన్‌రెడ్డి, మన్మథరెడ్డి, ప్రేమ్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

