I’m Game | టాలీవుడ్లో ఆగష్టు నెల సినిమాల పరంగా అత్యంత బిజీగా సాగుతోంది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొరియన్ కనకరాజు, డీసీ చిత్రాలు ప్రస్తుతం మంచి వినోదాన్ని పంచుతుండగా, ఈ నెలలో రాబోయే రోజుల్లో కూడా పలు క్రేజీ ప్రాజెక్ట్‌లు బాక్సాఫీస్ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న భారీ చిత్రం ‘ఇరుముడి’ ఆగష్టు 21న విడుదల కానుంది. అయితే, ఈ సినిమాకు గట్టి పోటీ ఇస్తుందని భావించిన మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ చిత్రం ‘ఐయామ్ గేమ్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ మాత్రం ఈ రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఆగష్టు 20నే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడినట్లు ఫిలిం సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడం, పైగా ప్రేక్షకుల్లో ఆశించిన స్థాయిలో అంచనాలు నెలకొనకపోవడం వల్గనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సరైన ప్రమోషన్స్ కూడా లేకపోవడంతో ఈ వాయిదా అనివార్యమైనట్లు స్పష్టమవుతోంది. దుల్కర్ సినిమా రేసు నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు రవితేజ ‘ఇరుముడి’కి సోలో రిలీజ్ అడ్వాంటేజ్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ సినిమా కొత్త విడుదల తేదీ ఎప్పుడు ప్రకటించనున్నారు అనేది త్వరలోనే తెలియనుంది.