కడ్తాల్, సెప్టెంబర్ 21 : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో పచ్చని పొలాల్లో ఏర్పాటు చేయనున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ అలైన్మెంట్ను తక్షణమే మార్చాలని బాధిత రైతులు డిమండ్ చేశారు. హైటెన్షన్ విద్యుత్ లైన్ అలైన్మెంట్ను మార్చాలని డిమాండ్ చేస్తూ, మండల కేంద్రంలో బాధిత రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 14వ రోజుకి చేరుకున్నాయి.
దీక్షలో బాధిత రైతులు రామకృష్ణ, కేశవులు, శ్రీరాములుగౌడ్, సాకేత్, చాణక్య, సహార్ష్, విహాన్ కూర్చున్నారు. దీక్షలో కూర్చున్న వారికి పలు పార్టీలకు చెందిన నాయకులు పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనుగుప్తా, పెంటారెడ్డి, రాజేందర్యాదవ్, సత్యంయాదవ్, కృష్ణయాదవ్, మహేశ్, వెంకటేవ్, శ్రీనివాస్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.