కొడంగల్, మే 20 : అన్నదాతలు పండించిన పంటను విక్రయించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. రోడ్లపై ధాన్యం రాశులు పోసి కొనుగోళ్ల కోసం రోజుల తరబడిగా ఎదురుచూస్తున్నారు. పంటను పండించడం కన్నా.. దానిని అమ్ముకోవడమే గగనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా .. అక్కడ సక్రమంగా కొనుగోళ్లు జరుగడంలేదని.. సరిపడా గన్నీ సంచుల్లేక.. హమాలీల కొరత తీవ్రంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వడ్లను కాంటా పెట్టేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే సంచుల్లేక రోడ్లపైనే పోయాల్సి వస్తున్నదని..అకాల వర్షాలు వస్తే పంట మొత్తం తడిసిపోతుందని వాపోతున్నారు.
మండలంలో ని అప్పాయిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వ ర్యంలో ఏర్పాటైన కొనుగోలు కేంద్రం లో విక్రయాలు సక్రమంగా సాగడంలేదని.. పది రోజులుగా ఆ కేంద్రం వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు సంచుల కొర త ఉందంటూ వారం రోజులుగా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వాపోతున్నారు. ఎండిన పంటను సంచుల్లో నింపుకొని కేంద్రానికి తీసుకొస్తామంటే గన్నీ సం చులు లేవని.. అవి వచ్చే వరకు ధాన్యాన్ని తీసుకురావద్దని సూచిస్తున్నారన్నారు. పంట కల్లాలు, రోడ్లపై ఉన్నదని.. వర్షం వస్తే తడిచిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రానికెళ్తే సంచు ల్లేవని.. వారం రోజులుగా అక్కడి సిబ్బంది తిప్పుకొంటున్నారు. పూర్తిగా ఎండిన పంట మంగళవారం ఒక్కసారిగా కురిసిన వానకు తడిసి ముైద్దెయింది. ఆ వడ్లను మళ్లీ ఆరబెట్టాలంటే చాలా కష్టంగా ఉన్నది. 3 ఎకరాల్లో 60 సంచుల ధాన్యం దిగుబడి రాగా.. దానిని వారం రోజులుగా రోడ్డుపై ఆరట్టి.. కుటుంబ సభ్యులందరం కలిసి కాపలాగా ఉన్నాం. ఇప్పుడు ఆ ధాన్యం మొత్తం తడిసిపో యింది. ఏమి చేయా లో అర్థం కావడంలేదు. కేంద్రం నిర్వాహకులు సంచులు ఇచ్చి ఉంటే కాంటా కూడా అయ్యేది. అధికారులు స్పం దించి అన్నదాతల కష్టాలు తీర్చాలి.
– కొమ్ము రామయ్య, రైతు, అప్పాయిపల్లి, కొడంగల్.