రంగారెడ్డి, జూలై 18 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండో రోజూ మంగళవారం రైతు సభలు విజయవంతంగా కొనసాగాయి. ఎవుసానికి మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రైతాంగం ఆగ్రహించింది. రైతు వ్యతిరేక కాంగ్రెస్ మాకొద్దంటూ ముక్తకంఠంతో నినదించారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. రాష్ట్రం రాక ముందు కరెంట్ కష్టాలు వర్ణనాతీతమని, కాంగ్రెస్ పార్టీ మళ్లీ అంధకారంలోకి నెట్టాలని చూస్తున్నదని, మూడు గంటల కరెంట్ సరఫరాతో వ్యవసాయం ఎట్లా చేస్తారని మండిపడ్డారు.
వికారాబాద్ జిల్లాలోని పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల్లోని పలు రైతు సమావేశాల్లో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా.. కొండన్నగూడలో జరిగిన రైతు సభలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ నేతల దుర్మార్గపు ఆలోచనలను రైతులకు వివరించారు. సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. మూడు గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా.. నిరంతర ఉచిత విద్యుత్తు ఇచ్చే బీఆర్ఎస్ కావాలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు సూచన మేరకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని, ఆయన సొంత పార్టీ నేతలే తప్పుబట్టారన్నారు. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రైతు సభలకు అన్నదాతలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివస్తున్నారు.
వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్తు చాలన్న కాంగ్రెస్‌కు పుట్టగతులుండవ్. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీనే కావాలని అన్నదాతలు నినదించారు. రైతులను అప్పులపాలు చేసిన కాంగ్రెస్ వద్దని, రైతును రాజు చేసిన సీఎం కేసీఆర్ పాలనే కావాలని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మంగళవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రైతు వేదికల వద్ద సమావేశాలు నిర్వహించగా రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని కొండన్నగూడ గ్రామంలోని రైతువేదికలో నిర్వహించిన రైతుసభలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొని కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ అంధకార పరిస్థితులు వస్తాయని హెచ్చ రించారు.
అదేవిధంగా వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని చన్గోముల్ రైతు వేదికలో నిర్వహించిన రైతు సమావేశంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి పాల్గొనగా, పరిగి మండలంలోని రంగాపూర్ రైతు వేదికలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా వికారాబాద్ మండలంలోని నారాయణపూర్, మోమిన్‌పేట మండలంలోని కేసారం రైతువేదికల్లో జరిగిన రైతు సమావేశాల్లో వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగలా మారిందని, రైతులు సంతోషంగా పంటలను సాగు చేసుకుంటున్నా రన్నారు. మూడు గంటల విద్యుత్తు ఇచ్చే కాంగ్రెస్ కావాలా.. మూడు పంటలకు ఉచిత నిరంతర విద్యుత్తు, సాగు నీరిచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో ప్రజలు తేల్చుకోవాలని సూచించారు.
కాంగ్రెస్‌తో ఒరిగిందేమీలేదు
వికారాబాద్/మోమిన్‌పేట, జూలై 18: కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్ల పాలనలో రాష్ర్టానికి ఒరుగ బెట్టిందేమీ లేదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మండలంలోని నారాయణపూర్, మోమిన్‌పేట మండలంలోని కేసారం గ్రామాల్లోని రైతువేదికల్లో జరిగిన సమావేశాలకు హాజరై మాట్లాడారు. రేవంత్‌రెడ్డి గ్రామాల్లోకి వచ్చి మూడు గంటల కరెంట్ ఇస్తామని చెబితే రైతులు తరిమితరిమి కొడతారని హెచ్చరించారు. గతంలో చం ద్రబాబు వ్యవసాయం దండగా అనగా.. ఆయన శిశ్యుడు రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్తు సరిపోతుందని అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన లో రైతులు ఎంతో గోస పడ్డారని.. ఎప్పుడు వస్తుందో తెలియని కరెంట్ కోసం పొలాల వద్దే నిరీక్షించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అన్నదాతలకు మంచి రోజులొచ్చాయన్నారు.
24 గంటల ఉచిత విద్యుత్తుతో పంటలను సాగు చేసుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు మెచ్చి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవార్డులను అందిస్తున్నదని కొనియాడారు. మూడు గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా.. మూడు పంటలకు కరెంట్ అందించే బీఆర్ఎస్ ప్రభు త్వం కావాలా రైతులు, ప్రజలు తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి 60 ఏండ్లు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. మూడు గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రానియొద్దని.. ఎక్కడికక్కడ అడ్డుకోని నిలదీయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ విజయ్‌కుమార్ ,ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు ముత్యంరెడ్డి, సుభాన్‌రెడ్డి, వికారాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, కమాల్‌రెడ్డి, వెంకట్, సర్పంచ్ సంఘం అధ్యక్షులు పురుశోత్తం రెడ్డి, హరిశంకర్ ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌వస్తే పథకాలను ఎత్తేస్తారు
పరిగి/పూడూరు, జూలై 18: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను తొలగిస్తారని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి అన్నా రు. మంగళవారం పూడూరు మండలం చన్గోముల్లోని రైతువేదికలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్‌లో ఉచిత విద్యుత్తు ప్రస్తావనే లేదని, నాడు వైఎస్సార్ ఇచ్చిన ఉచిత విద్యుత్తు కూడా అంతం త మాత్రమేనని తెలిపారు. రేవంత్‌రెడ్డి చంద్రబాబు శిష్యుడని, ఆయన సూచన మేరకే ఉచిత విద్యుత్తుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. రేవంత్ వ్యాఖ్యలను సొంత పార్టీ నాయకులే తప్పు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే ధరణి, రైతుబంధు, రైతుబీమాతోపాటు పలు పథకాలను నిలిపేస్తారన్నారు. ఆ పార్టీ నాయకులు తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి రావాలని చూస్తున్నారని, అందువల్ల ప్రజలు, రైతు లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతుల కరెంట్ గోస చూసి చలించిపోయిన సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు కాగానే 24 గంటల విద్యుత్తును సరఫరా చేస్తూ అన్నదాతలను ఆదుకుంటున్నారని కొనియాడారు. వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా..? మూడు పంటలకు ఉచిత విద్యుత్తు అందించే బీఆర్ఎస్ పార్టీ కావాలా ప్రజ లు తేల్చుకోవాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో రెండు లక్షల మెట్రిక్ టన్నులకు పంట దిగుబడి పెరిగిందని అన్నదాతలు సంతోషంగా ఉన్నారన్నారు.
కాంగ్రెస్‌ను నమ్మితే బతుకులు ఆగమే..
చన్గోముల్, రంగాపూర్లలోని రైతువేదికల్లో జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ను నమ్మితే రైతులు, ప్రజల బతుకులు ఆగమవుతాయన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో చర్చ పెట్టాలని సూచించారు. గత కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పు డు వస్తుందో.. పోతుందో తెలియని దుస్థితి ఉండేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. రూ.1400 కోట్ల తో కాలువల నిర్మాణ పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారని, జిల్లాలో మొదట పరిగి నియోజకవర్గ భూములకే నీరు అందనున్నాయని ఆయన తెలిపారు. పంటల సాగుకు అప్పులు చేయొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదికి రెండు పంటలకు కలిపి రూ.10 చొప్పున పంపిణీ చేస్తూ ఆదుకుంటున్నదన్నారు. అం తేకాకుండా అన్నదాతల అభ్యున్నతికి అనేక పథకాలను అమ లు చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే మాటలు విని మోసపోవద్దని రైతులు, ప్రజలకు సూచించారు. కార్యక్రమాలలో పరిగి, పూడూరు మండలాల ఎంపీపీలు కరణం అరవిందరావు, మల్లేశం, పూడూరు జడ్పీటీసీ మేఘమాల, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, రైతుబంధు సమితి పరిగి, పూడూరు మండలాల అధ్యక్షులు రాజేందర్, రాజేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజరుద్దీన్, వైస్ ఎంపీ సత్యనారాయణ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమంపై చిత్తశుద్ధి లేదు
షాద్‌నగర్, జూలై 18: రైతులు పండించిన వాణిజ్య పంటలకు పన్నులేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తీవ్రస్థాయిలో మం డిపడ్డారు. 1970 కాలంలోనే రైతుల నుంచి కరెంట్ బిల్లులను వందల రూపాయల్లో ముక్కుపిండి వసూలు చేశారన్నారు. బోరు నీటి ద్వారా గంట సమయంలో ఎకరం చౌట పొలం కూడ పారదనే విషయం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి తెలువదా అని ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్తుపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం ఫరూఖ్‌నగర్ మండలంలోని కొండన్నగూడ గ్రామంలోని రైతువేదికలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం తమ స్వార్థ రాజకీయాల కోసమే రైతు అనే పదాన్ని వాడుతున్నారే తప్పా నిజంగా కాంగ్రెస్ నాయకులకు రైతు సంక్షేమంపై చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలోనే ఉచిత విద్యుత్తు ఇచ్చామని గొప్పగా చెబుతున్నా నాయకులు ఆనాడు జరిగిన రైతుల ఆత్మహత్యలను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.
ఎప్పుడు కరెంట్ వస్తుందో.. పోతుందో తెలియక అన్నదాతలు రాత్రి వేళల్లోనూ పొలాల వద్దే నిరీక్షించే వారని.. పాముకాటుతో, విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటనలు ఎన్నో ఉన్నాయని వివరించారు. రైతుల దుస్థితిని స్వయంగా చూసిన సీఎం కేసీఆర్ పంటల సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తుంటే అది చూసి ఓర్వలేక రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్తుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల బాగుకోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే వాటిని చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మింగుడుపడడం లేదన్నారు. కాంగ్రెస్ వస్తే అంధకారమేనని.. అందువల్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పంటలకు పన్నులేసిన కాంగ్రెస్ పాలన కావాలో.. రైతు సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. మూడు పంటలు పండించేందుకు ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈటె గణేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, నారాయణయాదవ్, పాపయ్యయాదవ్, మల్లేశ్‌యాదవ్, రవికుమార్, బాల్‌రాజ్, మధుసూదన్, ఆనంద్‌నాయక్, యాదగిరి, సోమ్లానాయక్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన కొండన్నగూడ గ్రామస్తులు
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై ఫరూఖ్‌నగర్ మండలంలోని కొండన్నగూడ గ్రామానికి చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు, యువకులు మంగళవారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి మరింత కృషిచేయాలని, రానున్న ఎన్నికల్లో పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను వివరించాలన్నారు.
మూడు పంటలు సాగు చేస్తున్నా..
కాంగ్రెస్ హయాంలో ఏ టైంకు అత్తదో.. ఏ టైంకు పోతదో తెలువని కరెంట్ గు రించి కండ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసేది. భార్యాపిల్లలను ఇండ్లల్లో వదిలి రాత్రిపూట మోటర్ల దగ్గరికెళ్లి పొలాలను పారించుకునేది. అచ్చీరాని కరెంట్‌తోని మోటర్లు కాలిపోతే అప్పుల పాలయ్యాం. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కష్టాలు తప్పా యి. 24 గంటల విద్యుత్తు సరఫరాతో నాకున్న మూడు ఎకరాల పొలంలో ఏడాదికి మూడు పంటలను సాగు చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నా. కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. మూడు గంటల కరెంట్ మూడు ఎకరాల పొలానికి నీటిని అందిస్తుందని అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి అన్నదాతలకు క్షమాపణ చెప్పాలి.
-శ్రీనివాస్ రెడ్డి,సైదాలీపూర్,మోమిన్‌పేట
రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులను నిట్టేట ముంచుతుంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అన్నదాతలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడు వస్తుందో.. పోతుందో తెలియని కరెంట్‌తోపాటు విత్తనాలు, ఎరువుల కో సం గోస పడ్డారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే రైతులకు కరెంట్ కష్టాలు తీరా యి. 24 గంటల విద్యుత్తు సరఫరాతో పంటలను సకాలంలో సాగు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు.
-కట్ట చిన్న జంగయ్య , మాడ్గుల మండలం
రెడ్డిల ఇజ్జత్ తీస్తుండు
వ్యవసాయాన్ని నమ్ముకున్న రెడ్డి కుల స్తుల ఇజ్జత్ రేవంత్‌రెడ్డి తీస్తున్నాడు. ఎవ్వరినీ అడిగిన గంటకు ఎంత పొలం పారుతుందో చెబుతారు. మన దిక్కు అసలే నీళ్లు ఉండవు. ఈ మూడు, నాలు గు యేండ్ల నుంచే పంటలు మంచిగా పండాయి. ఇప్పుడు బోర్లలో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. మూడు గంటల్లో మూడు ఎకరాల పొలం పారుతుందని చెప్పడం అసత్యం. రేవంత్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఎట్ల గోస పడ్డారో రైతులందరికీ తెలుసు. తెలంగాణ వచ్చి కేసీఆర్ సీఎం అయిత తర్వాతే అన్నదాతలకు మంచి రోజులొచ్చాయి. మనం ఎవరి మాటలను నమ్మొద్దు. మనకు కేసీఆర్ ఉన్నారు. మనకు రాజకీయాలతో పనిలేదు.
– మధుసూదన్‌రెడ్డి, రైతు, వెలిజర్ల గ్రామం, ఫరూఖ్‌నగర్ మండలం
దేశానికి అన్నం పెడుతున్నమంటే సీఎం కేసీఆర్ పుణ్యమే
తెలంగాణ రాక ముందు ఆరుతడి పంటలను సాగు చేస్తే అవి కూడ నీళ్లు లేక, కరెంట్ రాక ఎండిపోతుండే. కానీ ఇప్పు డు ఆ పరిస్థితి లేదు. సరిపడా విద్యుత్తు సరఫరా జరుగుతుంది. నీళ్లు మస్తుగా ఉన్నాయి. మనకు ఇష్టం వచ్చిన పంటలను పండించుకుంటున్నాం. సీఎం కేసీఆర్ పుణ్యాన మనమందరం దేశానికే అన్నం పెట్టే స్థాయికి వచ్చాం. ఈ విషయం కాంగ్రెస్ నాయకులకు తెలియదా..? రైతులను కష్టాల పాలు చేసింది కాంగ్రెస్ కదా ? రైతులు ఆలోచించాలి.
– సోమ్లానాయక్, కొంగగూడతండా, ఫరూఖ్‌నగర్ మండలం
గతంలో ఒక్క పంట కూడా పండేది కాదు
నాకు ఐదెకరాల పొలం ఉన్నది. అందులో ఏడాదికి మూడు పంటలను సాగు చేస్తున్నా. బోరులో పుష్కలంగా నీరు ఉండటం.. ప్రభుత్వం సరఫరా చేస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తుతో కూరగాయలు, పత్తి, పసుపు వంటి పంటలను పండిస్తున్నా. గత కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలతో ఏడాదికి ఒక పంట కూడా సరిగ్గా పండేది కాదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. వ్యవసాయం చాలా బాగా సాగుతున్నది. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
-సుభాన్ రెడ్డి నారాయణ పూర్, వికారాబాద్
ప్రతిరోజూ ఎదో ఒకటి కాలిపోతుండే..
కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం చేయాలంటే చాలా గోస పడాల్సి వచ్చేది. ప్రతిరోజూ ఎదో ఒకటి కాలిపోయేది. ఒకరోజు మోటరు.. మరోరోజు స్టార్టర్, ఇంకోరోజు ట్రా న్స్ఫార్మర్ కాలిపోతుందే. వాటిని బాగు చేయించుకునేందుకు అప్పు లు చేయాల్సి వచ్చేది. మట్టిని నమ్ముకొని బతికే రైతుల బాధలు ఏనాడూ పట్టించుకోని రేవంత్‌రెడ్డికి ఎట్లా తెలుస్తది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. పోయాయి. ఏనాడూ రైతుల గురించి నాయకులు ఆలోచించలేరు. కానీ.. కేసీఆర్ వచ్చిన తర్వాత మాకు మంచి రోజులొచ్చాయి. ఇప్పుడు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. తెలంగాణ రాక ముందు కరెంటు లేక ఎంతో గోస పడ్డాం. కాంగ్రెస్ అస్తే మళ్లీ అదే గోస వస్తది. మాకు మంచిగా విద్యుత్తును సరఫరా చేస్తున్న సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం.
– బాల్‌రాజ్‌గౌడ్, రైతు, వెల్జర్ల, ఫరూఖ్‌నగర్ మండలం