Farmer Registry | కేశంపేట, జులై 5 : రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకుంటేనే కేంద్ర ప్రభుత్వం వస్తున్న పథకాలు రైతులకు అందుతాయని లేమామిడి క్లస్టర్ ఏఈవో సుధ అన్నారు. కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో శనివారం రైతుల వివరాలు సేకరించి ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏఈవో మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకునేందుకు రైతులు పూర్తిస్థాయిలో ఆసక్తి చూపడంలేదని, ఫార్మర్ రిజిస్ట్రీలో రైతుల పేరు నమోదు కాకపోతే కేంద్రం నుంచి వచ్చే పెట్టుబడి సాయం ఎకరానికి రూ.6వేలతోపాటు ఇతర పథకాలు రైతులకు అందవనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. లేమామిడి క్లస్టర్ పరిధిలోని లేమామిడి, బొదునంపల్లి, కాకునూరు గ్రామాల రైతులు విధిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకొని పథకాల అర్హుల జాబితాలో చోటు దక్కించుకోవాలని కోరారు.