మొయినాబాద్, మే 11 : ఓ వ్యక్తి అనుమతి లేకుండా ఫాంహౌస్‌లో జరిగిన విందులో స్వరాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాలకు చెందిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను వినియోగించడంతో ఎక్సైజ్ పోలీసులు ఫాంహౌస్‌పై దాడి చేసి సుమారు రూ.4 లక్షల విలువ చేసే మందును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మొయినాబాద్ పరిధిలో జరిగింది. ఎక్సైజ్ పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నగరానికి చెందిన తేజారెడ్డికి మొయినాబాద్ పరిధిలో ఫాంహౌస్ ఉన్నది. అందులో శనివారం రాత్రి బంధువులు, స్నేహితులకు అతడు పెద్ద పార్టీ ఇచ్చాడు.
స్వరాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాలకు చెందిన వివిధ రకాల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా వినియోగించాడు. సమాచారం అందుకున్న శంషాబాద్ డీటీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు ఆ ఫాంహౌస్‌పై దాడి చేసి.. ఢిల్లీకి చెందిన 50 బ్లాక్ లేబుల్ బాటిళ్లు, గోవాకు చెందిన నాలుగు చివాస్ రీగల్ బాటిళ్లు, తెలంగాణకు చెందిన 3 లిక్కర్, 12 బీర్ బాటిళ్లు, 1 సూలా వైన్, 1 మాన్షన్ హౌస్ బ్రాండీని స్వాధీనం చేసుకున్నారు. ఆ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని, ఫంక్షన్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.