ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 15 : పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించేవి పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు.. పాఠశాలలు, కళాశాలల్లో హడావిడి మొదలైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అన్నింటిని మించి తల్లిదండ్రులకు మరింత ఒత్తిడి పెంచింది. సిలబస్ దాదాపుగా పూర్తికావచ్చింది. మళ్లీ పునశ్చరణ తరగతులు, స్లిప్టెస్ట్ల నిర్వహణ చేయడానికి సన్నద్ధమవుతున్నారు.
ఉదయం 8 గంటల నుంచి సాయంత్ర ం 7 గంటల వరకు బోధనను కొనసాగిస్తున్నారు. దీంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది. ఉత్తమ ఫలితాలు సాధించాలంటే ఈ మాత్రం చదువులు కొనసాగించాల్సిందేనన్న భావనతో ముందుకెళ్తున్నారు. పరీక్షల్లో ప్రతిభను చూపాలనే తపన విద్యార్థుల్లో ఉండాలి. చదువుతున్న సబ్జెక్టుపై పూర్తిస్థాయి పట్టుసాధించాలి. ప్రాథమిక అంశాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించినట్లయితే విద్యార్థులు ఎక్కువగా ఒత్తిడికి గురికారు. ఆందోళన చెందకుండా ఏకాగ్రతతతో చదువుపై దృష్టి సారించాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాఠశాలలు, కళాశాలల్లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేశారు.
జిల్లాలోని అన్ని పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు ఇప్పటికే ప్రత్యేక తరగతులను ప్రారంభించాం. ఉదయం. సాయంత్రం వేళల్లో తరగతులు కొనసాగుతున్నాయి. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా సబ్జెక్టుల వారీగా బోధిస్తున్నారు. వంద శాతం ఉత్తీర్ణత, మంచి గ్రేడ్లు సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం.
– సుశిందర్రావు, జిల్లా విద్యాధికారి