Govt School | మంచాల, జూన్ 3 : తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి పాఠశాల అభివృద్ధికి సహకరించాలంటూ ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల టీచర్లు కోరారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతూ.. మండలంలోని వివిధ గ్రామాల్లోని ఆశా వర్కర్లు ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యా కమిటి సభ్యుడు కంబాలపల్లి భాస్కర్ మాట్లాడుతూ.. ఆరుట్లలో ఇంటిగ్రేడ్స్ పాఠశాల అడ్మిషన్లు ప్రారంభమైనందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపించకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. ఆరుట్ల పాఠశాలలో విద్యార్థులకు మౌళిక వసతుల కోసం రూ. 10 కోట్లతో విశాలమైన గదులు, కిచెన్ షెడ్, క్రీడాస్థలం, విశాలమైన లైబ్రరీ, రోడ్లతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే భోధన చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్లు అమృత, జ్యోతి, అలివేలు, పుష్పలత, విజయలక్ష్మి, నాగలక్ష్మి, మణి, సుజాత, సునిత, సరిత తదితరులు పాల్గొన్నారు.