మరింత అభివృద్ధి కోసం గెలిపించండి
మరోసారి బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని కుత్బుల్లాపూర్, గౌరెల్లి, బాచారం, బలిజగూడ, తారామతిపేట, అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
- బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
- అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ప్రచార హోరు
పెద్దఅంబర్‌పేట/ అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 27: మరోసారి బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని కుత్బుల్లాపూర్, గౌరెల్లి, బాచారం, బలిజగూడ, తారామతిపేట, అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి నల్లా నీటిని అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
ప్రతి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని, మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రతి గడపకు వివిధ సంక్షేమ పథకాలు చేరాయని తెలిపారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, కేసీఆర్ కిట్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని, గ్రామాల్లో తాగునీటి గోసను తీర్చామని చెప్పారు. రైతులు వివిధ కారణాలతో చనిపోతే ఆయా కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున అందజేస్తూ కుటుంబాలకు భరో ఇస్తున్న సర్కారు బీఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు.
ప్రచార కార్యక్రమాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, బాటసింగారం సహకార బ్యాంకు సంఘం అధ్యక్షుడు లెక్కల విఠల్‌రెడ్డి, జడ్పీ కోఆప్షన్ అక్బర్‌అలీఖాన్, సర్పంచ్‌లు మల్లేశ్, స్వరూప, ఎంపీటీసీలు బాల లింగస్వామి, వెంకటేశ్‌యాదవ్, నాయకులు చంద్రశేఖర్, నర్సింహ, సురేశ్, రమేశ్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, శోభారాణి, జ్ఞానేశ్వర్‌గౌడ్, గోవర్ధన్, దేవిడి యాదయ్య, రావుల యాదయ్య, వేముల వెంకటేశ్, అల్లాజ్, సురేశ్, వెంకటేశ్, శ్రీను పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
పెద్దఅంబర్‌పేట : మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని విస్తృతం చేశారు. 15వ వార్డు పరిధి మర్రిపల్లి, ఆర్కేనగర్లో సోమవారం కౌన్సిలర్ పాశం అర్చన దామోదర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. మరోసారి మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కారు గుర్తుకు ఓటేయాలని కోరుతూ.. నమూనా ఈవీఎంతో అవగాహన కల్పించారు.

ఇందుపల్లవి, వివిధ కాలనీల్లో 14వ వార్డు కౌన్సిలర్ రోహిణి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. తట్టిఅన్నారం, చుట్టు పక్కల పలు కాలనీల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనంతుల వెంకటేశ్వర్‌రెడ్డి, దేవిడి విజయ్‌భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం జరిగింది.
మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపు ఖాయం
తుర్కయంజాల్ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన మ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపు ఖాయమని డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కారు గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా విభాగం మున్సిపాలిటీ అధ్యక్షురాలు అశ్విని, నాయకులు కొంతం యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారీ మెజార్టీతో గెలిపించాలి
యాచారం : కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పాచ్ఛ భాష అన్నారు. మండలంలోని మేడిపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పదేండ్లలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీని మూడో సారి అధికారంలోకి తీసుకురావాలన్నారు. దీనికోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ శివలీల రమేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మంచాలలో జోరుగా ప్రచారం
మంచాల : వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది. ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. బోడకొండ, ఎల్లమ్మతండా, ఆరుట్ల, రంగాపూర్, చీదేడు గ్రామాల్లో ప్రచారం కొనసాగింది. కార్యక్రమంలో బద్రీనాథ్గుప్తా, వెంకటేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

