హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : మరో వెయ్యి సర్కార్ బడుల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ప్రస్తుతం వెయ్యి బడుల్లో ఈ యూనిట్లు ఉండగా, ఈ విద్యాసంవత్సరం మరో వెయ్యి బడుల్లో యూనిట్లు నెలకొల్పనున్నామని తెలిపారు.
కొంపల్లిలోని శిక్షణకేంద్రంలో అదునాతన వసతులు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. స్పోర్ట్స్ ట్రాక్ సహా మరికొన్ని వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. పనులు పూర్తైన తర్వాత విద్యార్థులకు శిక్షణనిస్తామని, అత్యుత్తుమ సేవలందించిన వారిని త్వరలోనే సన్మానించబోతున్నామని తెలిపారు.