మేడ్చల్, ఆగస్టు17(నమస్తే తెలంగాణ): ప్రైవేట్ ఆస్తులను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాలలో ప్రైవేట్ ఆస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలిచి పోరుబాట పట్టనున్నది. మంగళవారం మల్కాజిగిరి నియోజకవర్గంలో జరిగే పోరుబాటలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొననున్నారు.