బండ్లగూడ మే 22 : గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రెస్టేజ్ విల్లాస్ వద్ద ఓ వృద్ధురాలు (86) రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది.
అక్కడే ఉన్న స్థానికులు ఈ ఘటనను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సగటు స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు గల కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు సీసీ పుటేజులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.