విద్యా వ్యవస్థ పటిష్టతకు ప్రభుత్వం పకడ్బందీచర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. కడ్తాల్ మండల పరిధిలోని ఎక్వాయిపల్లి గ్రామంలో గురువారం పౌర పఠన కేంద్రాన్ని ప్రారంభించిన ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లో కలిపి మొత్తం 80 వేల ఉద్యోగాల భర్తీకి విడుతలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నదని తెలిపారు. ఉద్యోగార్థుల సౌకర్యార్థం పుస్తక పఠన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తొలి పౌర పఠన కేంద్రాన్ని ఎక్వాయిపల్లి ప్రారంభించినట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌తోపాటు ఇతర పుస్తకాలు, వార్తా పత్రికలు అందుబాటులో ఉంటాయని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో మొదటి విడుతలో భాగంగా 5 వేల రీడింగ్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
కడ్తాల్, జనవరి 5: విద్యావ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని..గురుకులాల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల వసతులను కల్పి స్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామం లో పౌర పఠన కేంద్రం, దళితబంధు యూనిట్, రూ.5 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కరుణ, రాష్ట్ర గ్రం థాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెంకటరమణరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లోని 80వేల ఉద్యోగాల భర్తీకి విడుతల వారీగా నోటిఫికేషన్లను జారీ చేస్తున్నదని తెలిపారు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి పుస్తక పఠన కేం ద్రాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. రా ష్ట్రంలోనే తొలి పౌర పఠన కేంద్రాన్ని ఎక్వాయిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినట్లు.. ఇందులో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని ఆమె తెలిపారు. రాష్ట్రంలోనిఅన్ని ప్రభుత్వ బడుల్లో మొదటి విడుతలో ఐదువేల రీడింగ్ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా ఉన్నత పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు విద్యార్థుల్లో నైపుణాన్ని పెంచేందుకు లైబ్రరీ, సైన్స్‌ల్యాబ్, కంప్యూటర్లు, డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 1,150 గురుకులాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
పేద విద్యార్థుల డిగ్రీ చదువులకోసం 85 గురుకులాలు ఏర్పాటైతే..అందులో 56 గురుకులాలను ఎస్సీ, ఎస్టీ విద్యార్థినుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెం పొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నా రు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకంలో రూ.20 లక్షలను అందిస్తున్నదని.. ఇప్పటివరకు 5 వేల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా విదేశాల్లో చదువుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని ఆమె కొనియాడారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.
ఇతర రాష్ర్టాల ప్రజలు సీఎం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గ్రామాలు, తండాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ఆయన మన రాష్ర్టానికి సీఎంగా ఉండటం మనందరి అదృష్టమన్నారు. నియోజకవర్గాభివృద్ధికి ప్రభుత్వం రూ .150 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వర లో నియోజకవర్గానికి ఆరు వేల డబుల్ బెడ్రూం ఇండ్లు, 1,500 దళిత యూనిట్లు రానున్నట్లు తెలిపారు. సొంత స్థలం ఉన్న వారికి రూ.3 లక్షలు అం దిస్తామన్నారు. ఎక్వాయిపల్లిలో గీత కార్మిక, గొల్ల కురుమల భవనాల నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.
జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి మాట్లాడుతూ ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయన్నారు. బడీడు పిల్లలందరినీ ప్రభు త్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. కడ్తాల్ మండల కేంద్రంలో రూ.కోటితో నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెంకటరమణరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, గిరి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్‌లు సుగుణ, భాగ్యమ్మ, యాదయ్య, భారతమ్మ, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, ఉమావతి, ఉప సర్పంచ్‌లు ముత్యాలు, రామకృష్ణ, నర్సింహ, వినో ద్, ఎల్లాగౌడ్, డీపీవో శ్రీనివాస్‌రెడ్డి, డీఈవో సుశీందర్‌రావు, తహసీల్దార్ మురళీకృష్ణ, ఎంపీడీ వో రామకృష్ణ, సీఐ ఉపేందర్, ఎస్ఐ హరిశంకర్‌గౌడ్, గ్రం థాలయ సంస్థ డైరెక్టర్లు మాధవి, రాధమ్మ, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, భిక్షపతి, జంగయ్య, రమేశ్‌రెడ్డి, సతీశ్‌రెడ్డి, నర్సింహాగౌడ్, లాలయ్య, సాయిలు, యాదయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.
కడ్తాల్, జనవరి 5: ఎక్వాయిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ కార్యదర్శి వాకా టి కరుణ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల తరగతులు, రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు తెలుగు, గణితం, ఆంగ్లం సబ్జెక్టుల్లోని పలు ప్రశ్నలను అడిగి జవాబులను రాబట్టారు. విద్యార్థులు చెప్పిన సమాధానాలతో ఆమె సంతృప్తి చెందారు. అనంతరం డీఈవో సుశీందర్‌రావు, ఏంఈవో సర్ద్ధార్నాయక్, ఉపాధ్యాయ బృందంతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు.
కందుకూరు : సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తున్నట్లు విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆమె మండలంలోని మాదాపూర్‌లో జిల్లా గ్రంథాలయ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన పబ్లిక్ రీడింగ్ రూంను ప్రారంభించి..అందులోని పుస్తకాలను తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లోని వారందరూ తమ పుట్టిన రోజు, పెండ్లి రోజు వంటి ప్రముఖ రోజుల్లో ఒక పుస్తకాన్ని గ్రంథాలయానికి బహుమతిగా ఇవ్వాలని సూచించారు.