కడ్తాల్, ఫిబ్రవరి 28 : కడ్తాల్ మండలంలో పోడు భూముల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. పోడు భూముల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ, సోమవారం మండల పరిధిలోని జమ్ములబావి తండాకి చెందిన 60 గిరిజన కుటుంబాలు హైదరాబాద్‌లో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ని కలిసి వినతి పత్రం అందజేశారు.
1986 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం సర్వే నెంబర్ 260లో గిరిజనులకు భూములను కేటాయించిందని, గత ముపై ఆరేండ్ల నుంచి తండాకి చెందిన గిరిజన, చెంచు కుటుంబాలు ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తండావాసులు ఎమ్మెల్యేకి విన్నవించారు. ఆ భూములకు పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యేని కోరిన్నట్లు గిరిజనులు తెలిపారు. పోడు భూములకి సంబంధించిన సమస్యలను పరిష్కారించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, గిరిజనులకు పట్టాలు ఇప్పిచేందుకు అధికారులతో చర్చిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.