చేవెళ్ల రూరల్, అక్టోబర్ 6: సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదని.. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మండలంలోని ఊరెళ్ల గ్రామంలో శుక్రవారం అం డర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, వైకుంఠధా మం, ఊరెళ్ల అనుబంధ గ్రామమైన మొండివాగులో మైనార్టీ కమ్యూనిటీ హాల్ భవనం తదితర అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మంత్రి సబితారెడ్డి ప్రా రంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభ్యున్నతికి కేటాయిస్తున్న కోట్లాది రూపాయల నిధులతో పల్లెల రూపురేఖలే మారిపోయాయని.. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనాలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, నర్సరీలు, క్రీడా ప్రాంగణాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.
సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకంతో రాష్ట్రంలోని 23 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందజేయడం సీఎం కేసీఆర్ మానవతాదృక్పథానికి నిదర్శనమని కొనియాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒకటి నుంచి పదోతరగతి చదివే విద్యార్థులందరికీ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని పేర్కొన్నారు. మొండివాగు గ్రామంలో కొన్నేండ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులను ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ నిరంతరం సకల జనుల సంక్షేమం కోసం ఆలోచిస్తుంటారని పేర్కొన్నారు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ శుద్ధి చేసిన తాగునీరు సరఫరా అవుతున్నదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబాక్ పథకాలతో ఆడబిడ్డలకు అండగా నిలిచారని.. అంతేకాకుండా పంటల సాగు కోసం అన్నదాతలు అప్పుల పాలు కావొద్దనే సదుద్దేశంతో పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారని గుర్తు చేశారు, అన్నదాత మృతి చెందితే రైతుబీమా కింద బాధిత కుటుంబానికి రూ.ఐదు లక్షలు అందిస్తూ ఆదుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలందరూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ముచ్చటగా మూడోసారి యాదయ్యను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. కార్యక్రమం లో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, ఊరెళ్ల సర్పంచ్ జహంగీర్, వైస్ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్‌లు మోహన్‌రెడ్డి, వెంకటేశంగుప్తా, లావణ్యాశంకర్, భీమయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అబ్దుల్ ఘని, గ్రామస్తులు పాల్గొన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొంది సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని పథకాలు ఇక్కడ అమలవుతున్నాయి. ఇంటింటికీ అందుతున్న పథకాలతో ప్రజల సంతోషంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల మనిషి.. ఆయనతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యం. బీజేపీ, కాం గ్రెస్ పార్టీల మోసపూరిత హామీలను ప్రజలు నమ్మొద్దు. పని చేసే ప్రభుత్వాన్ని మరోసారి దీవించాలి.
– కాలె యాదయ్య, ఎమ్మెల్యే