పరిగి, మార్చి 27 : టెన్త్ పరీక్షా కేంద్రాలు కొనసాగుతున్న పాఠశాలల్లో ‘మధ్యాహ్న భోజనానికి పడిగాపులు’ అన్న శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. టెన్త్ పరీ క్షా కేంద్రాలుగా కొనసాగుతున్న పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సిబ్బందిని ఒంటిగంట వరకు లోపలికి అనుమతించకపోవడంతో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల తర్వాతే భోజనం విద్యార్థులకు అందుతుందని ఆ కథనంలో పేర్కొనడం జరిగింది. కాగా, సంబంధిత పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 12.40 గంటలకు విద్యార్థులతోపాటు.. పరీక్షలకు హాజరైన స్టూడెంట్స్కూ భోజనాన్ని అందించాలని.. భోజనాన్ని తయారు చేసే సిబ్బందికి పరీక్షల కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్లు గుర్తింపు కార్డులు జారీ చేసి వారిని పాఠశాలలకు అనుమతించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.