బొంరాస్పేట, అక్టోబర్ 2 : దసరా నవరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధల తో దుర్గామాతను పూజించి దశమి రోజు ద సరా పండుగను జరుపుకొంటారు. వికారాబా ద్ జిల్లాలోని కొడంగల్, తాండూరు, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల్లోని వివిధ మం డలాల్లోని ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఆలయాలు, గ్రా మాల్లో మండపాలను ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు.
గురువారం దుర్గామాతను ప్రతిష్ఠించి పూజలు చేయడంతో నవరాత్రులు ప్రారంభమవుతాయి. నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజూ దుర్గామాత అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరిస్తారు. ప్రతిరోజూ వివిధ రకాలైన నైవేద్యాలను అమ్మవారికి స మర్పించి పూజిస్తారు. నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిదిరోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. మండపాల్లో ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహాలను దసరా పం డుగ రోజు చెరువుల్లో నిమజ్జనం చేసి ఆనందోత్సవాలతో పండుగను జరుపుకొంటారు.
నవరాత్రుల సందర్భంగా ఆలయాలు, దుర్గామాత మండపాల ఆవరణల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాండియా నృ త్యాలు, కోలాటం ప్రదర్శనలు, భజనలు తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటితో పాటు నిత్య పూజలు, కుంకుమార్చన చేపడుతారు. అమ్మవారు ప్రతి రోజూ ఓ అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.