బంట్వారం, డిసెంబర్ 18 : మండలంలో 11గ్రామ పంచాయతీలు ఉండగా, 14 గ్రామాలు ఉన్నాయి. ఇందులో మొత్తం జనాభా సుమారు 20వేలకు పైగా ఉంది. మండ లంలో మొత్తం 11 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను నిర్మించారు. మొత్తం 42.336 కిలోమీటర్ల పైప్ లైన్ వేశారు. తొరుమామిడి గ్రామంలో అత్యధికంగా 11.38 కిలో మీటర్లు కాగా, మండల కేంద్రంలో 9.2 కిలోమీటర్ల పైప్ లైన్ వేశారు.
అదే విదంగా బొపునారం 5.4 మధ్వాపూర్ 1.6, మాలసోమారం 1.8, మంగ్రాస్పల్లి 1.3, నాగ్వారం 1.0 నాగ్వారంతాండ 0.7 నూరుళ్లపూర్ 0.8, రొంపల్లి 4.5, సల్బత్తాపూర్ 4.0, సుల్తాన్ పూర్ 1.6, యాచారం 1.1కిలో మీటర్లు పైప్ లైన్ శారు. ఇందులో ప్రధానంగా రొంపల్లి, మంగ్రాస్పల్లి, నాగ్వారం, సల్బత్తాపూర్, తదితర గ్రామాల్లో నీటి సరఫరా ప్రారంభమైంది. ప్రస్తుతం మండలంలో 90 శాతం మిషన్ భగీరథ పనులు పూర్తై యినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇంటింటికీ నీటి సరఫరా కొనసాగుతున్నది.
నీళ్ల గురించి చింత లేదు
మిషన్ భగీరథ నీళ్లు సరిపడ వస్తున్నాయి. గతంలో లాగా నీళ్లకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు ఊర్లో ఎవరికి నీళ్ల గురించి చింత లేదు.
– జె. మంజుల రొంపల్లి గ్రామం
వంద శాతం పనులు పూర్తి
మండలంలో పనులు వంద శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే ఇంటింటికీ తాగు నీరు అందిస్తున్నాం. మండలం లో 11 గ్రామ పంచాయతీలుండగా, రెండు అనుబంద గ్రా మాలున్నాయి. వీటిలో ప్రతి గ్రామంలో ఇప్పటికే ఇం టిం టికీ నీటి సరఫరా కొనసాగుతున్నది.
– వేణుమాధవ్ ఏఈ ఆర్డబ్ల్యూఎస్, బంట్వారం