రంగారెడ్డి, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో చెరువులు ఎండిపోతున్నాయి. గత కేసీఆర్ హయాం లో చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడంతోపాటు వాటికి నీరందించే ప్రధాన కాల్వలకూ మరమ్మతులు చేయగా రెం డేండ్ల కిందట కురిసిన వానలకు చెరువులు, కుంటలు నిండా యి. ఆ తర్వా త ఆశించిన మేర వర్షాలు కురియకపోవడంతో చెరువులు, కుంట లకు నీరురాక ఎండుముఖం పట్టాయి.
గతేడాది చెరువులు, కుంటల్లో నీరు లేకపోవడంతో కేవలం యాభైశాతం చేప పిల్లలను మాత్రమే రేవంత్ ప్రభుత్వం పం పిణీ చేసింది. బీఆర్ఎస్ హయాంలో జిల్లాలో 1.20 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేయగా.. రేవంత్ సర్కార్ 59 లక్షల చేపపిల్లలను పంపిణీ చేసిం ది. ఈ ఏడాది చెరువుల్లో నీరు లేకపోవడంతో వాటిని కూడా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు మత్స్యశాఖను నిధుల కొరత వేధిస్తుండడంతో ఈ ఏటా చేపపిల్లలను పంపిణీచేసే అవకాశాలు లేనట్లేనని తెలుస్తున్నది. చెరువులు ఎండిపోవడంతో వా టిపై ఆధారపడిన మత్స్యకారులు ఉపాధికి దూరమయ్యే అవకాశాలున్నాయి. జిల్లాలో 196 సొసైటీ ల్లో 10 వేల మందికి పైగా సభ్యులున్నారు.
మూతపడిన చేప పిల్లల పెంపకం కేంద్రం..
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సమీపంలో గతంలో చేపపిల్లల పెంపక కేంద్రం ఉండేది. ఇక్కడే చేప పిల్లలను పెంచి జిల్లాలోని చెరువులకు సరఫరా చేసేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెంపక కేంద్రం మూతపడింది. చేపపిల్లల పెంపకం కోసం ఏర్పాటు చేసిన నీటితొట్లూ ఎండిపోయాయి. ఈ కేంద్రంలో చేపపిల్లలను పెంచడంతోపాటు మత్స్యకార సహకార సంఘాల వారికి శిక్షణ కూడా ఇచ్చేది. నిధుల కొరతతో ప్రభుత్వం దీనిని మూసేసింది. గత కేసీఆర్ ప్రభుత్వం ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ పరిధిలోని మత్స్యకారులు చేపలను తీసుకొచ్చి విక్రయించేందుకు వీలుగా ఇబ్రహీంపట్నంలోని చేపపిల్లల పెంపక కేంద్రం వద్ద ఫిష్మార్కెట్ ఏర్పాటుకు సకల్పంచి రూ.2 కోట్లను మంజూ రు చేసింది. అయితే, ప్రభుత్వం మారడంతో చేపల మార్కెట్ ఊసే ఎత్తడంలేదు. మంజూరైన నిధులు కూడా దారి మళ్లినట్లు ఆరోపణలున్నాయి.
జిల్లాలో 982 చెరువులు..
జిల్లాలో 982 చెరువులున్నాయి. వాటిలో ఇబ్రహీంపట్నం పెద్దచెరువు, యాచారం మండలంలో ని లక్ష్మణ్చెరువు, మంచాల మండలం, లింగంపల్లిలోని సాబిత్నగర్ చెరువుతోపాటు మరో పది పెద్దచెరువులు ఉన్నాయి. ఈ తటాకాల్లో మాత్రమే నీరు నిల్వ ఉండగా.. మిగిలిన చెరువుల్లో 80 శాతానికిపైగా ఎండిపోయాయి. చెరువులు ఎండిపోతుండడంతో చేపలు పట్టుకుని ఉపాధి పొందే మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు చెరువుల్లో 60 శాతం నీరుంటేనే చేపపిల్లలను పం పిణీ చేస్తామని ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నది. కాగా, రావిర్యాల, ఇబ్రహీంపట్నం, మాసాబ్చెరువు వంటి వాటిలో 60 శాతం కూడా నీళ్లులేవు.. దీంతో ఆ చెరువుల్లో చేప పిల్లలను వదిలే పరిస్థితి లేదని తెలుస్తున్నది. కేసీఆర్ హయాంలో చెరువులన్నీ నిండుకుండల్లా ఉండడంతో పెద్ద ఎత్తున చేప పిల్లలను తటాకాల్లో వదిలారు. ఏ గ్రామంలో చూసినా చేపలను రాశులుగా పోసి అమ్మేవారు.
చెరువుల్లో నీళ్లుంటేనే మత్స్యకారులకు ఉపాధి
చెరువుల్లో నీరుంటేనే మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుం ది. తటాకాల్లో నీరు లేకపోవడంతో ఈ వృ త్తిని నమ్ముకుని జీవిస్తున్న లక్షలాది మం ది రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తమకు ఉపాధి కల్పించడంతోపాటు.. ఇబ్రహీంపట్నంలో ఉన్న చేపపిల్లల పెంపకం కేంద్రాన్ని పునరుద్ధరించి మత్స్యకారులకు శిక్షణ ఇవ్వాలి.
-గుంటి కిరణ్, మత్స్య సహకార సంఘం సభ్యుడు
చెరువుల్లో బోరుబావులు తవ్వించి ఉపాధి కల్పించాలి
చెరువులు, కుంటలు ఎండిపోతుండడం తో మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోతున్నది. గతంలో చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉండడంతో చేపల ను విక్రయించి ఉపాధిని పొందాం. ప్రభుత్వం
స్పందించి గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో బోరుబావులు తవ్వించి మత్స్యకారులకు జీవనోపాధి కల్పించాలి.
-నర్సింహ, మత్స్యకారుల సంఘం నాయకుడు