రంగారెడ్డి, మే 23 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధుల్లేక పంచాయతీలు నీరసించి పోతున్నాయి. ఈ ప్రభా వం హరితహారంపైనా పడింది. ఫలితంగా మొక్కల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారిం ది. బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పల్లెలు ప చ్చదనంతో కళకళలాడాయి. కానీ..కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం హరితహారంపై పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నది. ఈ ఏడాది మొక్కల నాటింపుపై ఇప్పటివరకు అధికారులకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ కాకపోవడంతో హరితహారం కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత బీఆర్ఎస్ హయాంలో నాటిన మొక్కల సంరక్షణ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. గతంలో అవెన్యూ ప్లాంటేషన్ పేరిట ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ లు రోడ్లకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటాయి. అయితే ఆ మొక్కల సం రక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో మొక్కల ఆనవాళ్లే లేకుండా పోయే పరిస్థితులు నెలకొన్నాయి.
మొక్కల చుట్టూ ఏపుగా గడ్డి, పిచ్చి మొక్కలు పెరగగా.. వాటి తొలగింపునకు తీసుకున్న చర్యలు నిల్.. కొన్నిచోట్ల గుర్తు తెలియని వ్యక్తులు గడ్డికి నిప్పు పెట్టడంతో హరితహారం మొక్కలు బుగ్గిపాలవుతున్నాయి. ప్రతి మం గళ, శుక్రవారాల్లో విధిగా మొక్కలకు నీళ్లు పడుతున్నట్లు అధికారులు చెప్తుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితులు కనబడడం లేదు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత పూర్తిగా గ్రామ పంచాయతీలదే కావడంతో నిధుల లేమితో మొక్కలకు సక్రమంగా నీళ్లు పట్టడం లేదు. మొక్కలు ఎండిపోతే..వాటి స్థానంలో కొత్తగా మొక్కల నాటించేందుకు తీసుకుంటున్న చర్యలు సైతం శూన్యమే.

పచ్చదనాన్ని పెంచే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా హరితహారం పేరిట భారీగా మొక్కలను నాటించింది. 2015 సంవత్సరం నుంచి యజ్ఞంలా ఈ కార్య క్రమాన్ని చేపట్టి సక్సెస్ చేసింది. ఈసారి కూడా జిల్లాలోని 558 గ్రామ పంచాయతీ ల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. గతంలో జూన్ మాసం నాటికే ప్రభుత్వ శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించి ఆ మేర మొక్కలు నాటేలా ఉన్నతాధికారులు పర్యవేక్షించేవారు. కానీ..ఈ ఏడాది హరితహారానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. అంతేకాకుండా..ఈ ఏటా లక్ష్యాన్ని సైతం గణనీయంగా తగ్గించారు. కేవలం 25 లక్షల మొక్కలు నా టేందుకే ప్రణాళికను రూపొందించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నప్పటికీ మొక్కలు నాటేందుకు ఆయా శాఖలు సన్నాహాలు మొదలుపెట్టకపోవడం విస్మయం కలిగిస్తున్నది.
హరితహారం కార్యక్రమం ఎప్పుడూ కొనసాగేలా గత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. హరితహారానికి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు హరిత నిధిని ఏర్పాటు చేసింది. ప్రతినెలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధుల్లో 10 శాతం ఈ కార్యక్రమానికి ఖర్చు చేసేలా కార్యాచరణను రూపొందించా రు. హరితనిధి సేకరణలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యులను చేయాలన్న లక్ష్యంతో ఎంపీ స్థాయి నుంచి గ్రామ సర్పంచ్ వరకు, కలెక్టర్ నుంచి చిరుద్యోగి వరకు నెల వారీ వేతనం నుంచి హరితనిధిని సేకరించారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు సందర్భంగా ప్రతి రిజిస్ట్రేషన్‌పై నిర్దేశిత రుసుమును హరితనిధికి జమ చేసేలా ఏ ర్పాట్లు చేశారు. నాటిన మొక్కలను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం కేటా యించిన గ్రీన్ బడ్జెట్‌ను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టింది. గ్రామాల్లో విరివిగా మొక్కలను నాటి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టింది. దీంతో ప్రతి గ్రామం కూడా పచ్చదనంతో వెల్లివిరుస్తున్నది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏటా కార్య క్రమ నిర్వహణకు అవసరమైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే కాకుండా.. గతంలో నాటిన మొక్కలను సంరక్షించడంలోనూ విఫలమవుతున్నది. దీంతో పల్లెలు, రోడ్ల వెంట ఎక్కడ చూసినా ఎండిపోయిన మొక్కలే కనిపిస్తున్నాయి. హరితహార కార్యక్రమంపై నిర్లక్ష్యం తగదు.
-మంగళ్‌పల్లి నర్సింహ, కడ్తాల్ మండలం
కాంగ్రెస్ పాలనలో హరితహారం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో పల్లెలు పచ్చదనంతో కళకళలాడాయి. ఏ ఊరు..ఏ పల్లె చూసినా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. కానీ.. ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని పట్టించుకోవడంలేదు. గత ప్రభుత్వం నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవడంలేదు. దీంతో చాలా గ్రామాల్లో హరితహారం మొక్కలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించి గ్రామాల్లో పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకోవాలి.
-వీరాంజనేయులు, అంతారం గ్రామం, చేవెళ్ల రూరల్
అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి కూడా కేటాయిం చకపోవడంతో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడుతున్నది. వర్షాకాలం వస్తున్న హరితహా రం కార్యక్రమ నిర్వహణకు సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఏటా ప్రోగ్రాం ఉంటుందా..? ఉండదా..? అనే అనుమానం మొదలైంది. పంచాయతీల్లో బడ్జెట్ లేకపోవడంతో మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలి. -మచ్చెందర్,వార్డు సభ్యుడు, హాజిపల్లి, షాద్‌నగర్‌రూరల్
పర్యావరణ పరిరక్షణ, కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం హరిత హారం కార్యక్రమాన్ని అమలు చేసి సక్సెస్‌ఫుల్‌గా కొనసాగించింది. అంత మంచి కార్యక్రమాన్ని ఈ ఏటా కొనసాగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోక పోవడం దారుణం. హరితహారంతో ప్రతి పల్లె కూడా పచ్చదనంతో కళకళలాడుతుంది. అందువల్ల రేవంత్ రెడ్డి సర్కారు హరితహారం మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవడంతోపాటు ఎం డిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి.
-తెలుగు వెంకటేశ్, చేవెళ్ల
గత బీఆర్ఎస్ హయాంలో సక్సెస్‌ఫుల్‌గా సాగిన హరితహారం కార్యక్రమంపై కాం గ్రెస్ సర్కాస్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు. కేసీఆర్ ప్రభుత్వంలో జూన్ నెల ప్రారంభానికి ముందే ఈ కార్యక్రమ నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకు నే వారు. శాఖల వారీగా నాటాల్సిన మొక్కల లక్ష్యాన్ని నిర్దేశించేవారు. కానీ.. కాం గ్రెస్ సర్కార్ ఇప్పటివరకు అలాంటి చర్యలను తీసుకోలేదు. ఇప్పటికైనా హరితహా రం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించి నాటిన మొక్కలను సంరక్షించడంతోపాటు కొత్త మొక్కలను నాటేందుకు చర్యలు చేపట్టాలి.
-జిల్లెల జనార్దన్‌రెడ్డి, నందిగామ