తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇండ్లను కేటాయించడంతో వారి ఆనందం రెట్టింపు అయింది. ఇన్నేండ్లకు తమ కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సొంతింటి కలను సాకారం చేసి పేదల గుండెల్లో సర్కారు గూడు కట్టుకున్నది. ఎన్నో ఏండ్లుగా సంపాదనలో సగం ఇంటి కిరాయికే చెల్లించి.. బతుకు బండిని భారంగా కొనసాగిస్తున్న పేదల కుటుంబాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పండుగ తీసుకొచ్చింది. మార్కెట్లో లక్షల రూపాయల విలువ చేసే ఇంటిని పైసా ఖర్చు లేకుండా పారదర్శకంగా అందజేసింది. సొంతింటి కల సాకారమైన వేళ.. లబ్ధిదారులు సంబురాలు చేసుకుంటున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలు అందుకున్న వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. సోమవారం రంగారెడ్డి జిల్లాలో డబు ల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా పలువు రు లబ్ధిదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నేత అని కొనియాడారు. ఎవరికీ ఒక్క రూపాయీ లంచం ఇవ్వకుండా దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఉచితంగా ఇండ్లను పంపిణీ చేస్తున్నదని సంతోషం వ్యక్తం చేశారు. అర్హులందరికీ ఇండ్లు అందేలా చర్యలు తీసుకున్న సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పేదల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంంగాణ
గతంలో ఏ ప్రభుత్వం ఆదుకోలేదు
గతంలో ఏ ప్రభుత్వం కూడా మా కుటుంబాన్ని ఆదుకోలేదు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మా కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించడం సంతోషకరం. ఇప్పటి వరకు కిరాయి ఇంట్లో ఉండి జీవించాం. వచ్చే అరకొర జీతాలు సగం ఇంటి కిరాయికే పోయేది. దీంతో బతుకు భారంగా ఉండేది. ఉచితంగా సొంతింటిని కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటాం.
– కుండె బాలమణి, సరూర్‌నగర్
సీఎం కేసీఆర్‌ను ఎప్పటికీ మరువను
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎప్పటికీ మరువను. హైదరాబాద్‌లో అద్దె ఇండ్లల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న పేదలను గు ర్తించి ఉచితంగా సొంతింటిని కేటాయించడం చాలా సంతోషం. గజం స్థలం కూడా కొనలేని నాలాంటి వారికి రూ.20వేలకు గజం ఉన్న ఖరీదైన ప్రాంతంలో విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న స్థలంలో ఇండ్లు నిర్మించి ఇస్తారని ఊహించలేదు. సొంత ఇంట్లో ధైర్యంగా జీవిస్తాం. మాకు మేలు చేసిన సీఎం కేసీఆర్‌కే మద్దతిస్తాం.
– మైనం రాములు, సైదాబాద్
అద్దె ఇంటి కష్టాలు తీరాయి
డబుల్ బెడ్రూం రాకతో మాకు అద్దె ఇంటి కష్టాలు తీరాయి. ఎక్కడ అద్దెకున్న, ఆరు నెలలు, సంవత్సరం గడువగానే అద్దె పెంపు షరా మాములుగా మారింది. పెంచిన అద్దెలు చెల్లించే స్థోమత లేక అద్దె పెంచిన ప్రతిసారీ కొత్త ఇంటికి మకాం మార్చాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అందిస్తున్న డబుల్ బెడ్రూంతో మా అద్దె ఇంటి కష్టాలు శాశ్వతంగా దూరమవుతాయి. డబుల్ బెడ్రూంతో మాకు సొంత ఇల్లు, సొంత అడ్రస్ వచ్చింది.
– కోట నాగేంద్ర, లింగంపల్లి
పైసా ఖర్చు లేకుండా సొంతిల్లు
ఎన్నో ఏండ్లుగా కిరాయి ఇండ్లల్లో ఉంటూ ఇబ్బందులు పడు తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కు వరంలా తీసుకొచ్చిన డబుల్ బెడ్రూం ఇంటికి దరఖాస్తు పెట్టుకున్న నాటి నుంచి ఇంటిని పొందే వరకు పైసా ఖర్చు లే కుండా ముందుకుసాగినా. ఏ ఒక్కరికీ రూపాయి ఇవ్వకుండా నే డబుల్ బెడ్రూం లబ్ధిదారురాలిగా ఎంపికయ్యాను. జీవి తాంతం కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాను. డబుల్ బెడ్రూం రాదేమోనన్న భయంలో ఉన్న మాకు ఎమ్మెల్యే సార్ ఎంతో ధైర్యాన్నిచ్చారు. దళారులను నమ్మి పైసలు పొగొట్టుకోవదు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు వస్తాయన్న నమ్మకం నాకు ఉంది.
– సౌజన్య, పాపిరెడ్డి కాలనీ, శేరిలింగంపల్లి
మళ్లీ కేసీఆర్ సర్కారే రావాలి
డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చినందుకు చెప్పలేనంత సంతోషంగా ఉన్నది. మాది చాలా పేద కుటుంబం. దాదాపు 40 సంవత్సరాల నుంచి కిరాయి ఇంట్లో ఉంటున్నాం. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇండ్లు ఇస్తామని చెప్పి కాలం వెళ్లదీశాయి. మళ్లీ కేసీఆర్ సర్కార్ వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. మార్కెట్లో రూ.లక్షలు విలువ చేసే ఇంటి ని పైసా ఖర్చు లేకుండా పారదర్శకంగా అందజేశారు. ఇం టి పట్టా అందుకున్న సంతోషం జీవితాంతం మర్చిపోలేను. మేమంతా బీఆర్ఎస్ పార్టీకే మద్దతు తెలుపుతాం. మా కుటుంబం జీవితాంతం కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటుంది. మా పాలిట దేవుడు సీఎం కేసీఆర్.
– విష్ణుప్రియ, కొత్తపేట, హైదరాబాద్
ఇలాంటి ప్రభుత్వం మళ్లీ రావాలి
గూడు లేని పేదలను గుర్తించి ఉచితంగా ఇండ్లు కేటాయిస్తున్న ప్రభుత్వమే మళ్లీ రావాలి. తెలంగాణ సర్కారు దయతోనే నాకు డబుల్ బెడ్రూం ఇల్ల్లు వచ్చింది. రూపాయి ఖర్చు లేకుండా రూ.లక్షలు విలువ చేసే ఇల్లు కేటాయించిన సీఎం కేసీఆర్ సార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. అన్ని కులాలు, మతాలకు అతీతంగా సమన్యాయం చేస్తున్న కేసీఆర్ పాలనే తిరిగి రావాలి. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావాలి.
– షిరీన్ సుల్తానా, వనస్థలిపురం
కిరాయి కట్టలేక పోతున్నాం
మేము 30 ఏండ్ల నుంచి కిరాయి ఇంట్లోనే ఉంటున్నాం. ఇంటికి రూ.7 వేల కిరాయి కట్టలేక సతమతమవుతు న్నాం. 2016లో ఆన్లైన్లో పెట్టాం. ఇన్ని రోజుల తర్వా త ఇల్లు వచ్చిందని చెప్పగానే చెప్పరాని సంతోషం వచ్చిం ది. మాకు డబుల్ బెడ్రూం ఇంటిని ఇచ్చిన సీఎం కేసీఆర్ సల్లగా ఉండాలి. ఎన్నో పథకాలను పెట్టి బాగానే చూ స్తుండు. ఆయన వస్తేనే పేదలకు న్యాయం జరుగుతది. ఎైట్లెనా సీఎం మళ్లీ వస్తాడు. మేమంతా సీఎం కేసీఆర్ పార్టీకే మద్దతు తెలుపుతాం. ఇప్పుడు కూడా ఈ తెలంగాణ సర్కారే రావాలని కోరుకుంటున్నా.
– జహేర బీ. ఎన్టీఆర్నగర్
ఎట్టకేలకు సొంతింటి కల నెరవేరింది
ఎన్నో ఏండ్లుగా సొంతింటి జాగ కోసం ఎదురు చూస్తున్న నాకు ఎట్టకేలకు సొంతింటి కల నెరవేరింది. నేను కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నా. కిరాయి ఇంట్లో ఉంటున్నా. సీఎం కేసీఆర్ ప్రభుత్వం సొంతింటిని మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉన్నది. ఎవరి ప్రమేయం లేకుండానే ఇల్లు వచ్చింది. ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు. ఒక్క పైసా తీసుకో కుండా లక్షల రూపాయల ఇండ్లను అందజేసిన ప్రభుత్వం మళ్లీ రావాలి. సీఎం కేసీఆర్ సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటా.
– బోడ లక్ష్మి, ఎన్టీఆర్నగర్
నాకు చాలా సంతోషంగా ఉన్నది
డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చినందుకు చాలా సంతో షంగా ఉన్నది. మేం కాటేదాన్‌లో ఉంటున్నాం. రూ. 5వేల కిరాయి చెల్లిస్తున్నాం. మాది పేద కుటుంబం. కూ లి పని చేస్తేనే ఇల్లు గడుస్తది. ఒక కంపెనీలో భార్య భర్తలం పనికిపోతున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. మాకు దేవుడు కరుణించినట్లు సీఎం కేసీఆర్ ఇల్లును కేటాయిం చారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇండ్లు ఇస్తామని చెప్పి కాలం వెళ్లదీశాయి. తెలంగాణ రాష్ట్రంలో మాకు ఇల్లు వచ్చినందుకు సంతోషం. మా కుటుంబం ఎప్పుడు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటుంది.
– మంజుల, ప్రైవేటు ఉద్యోగి, రాజేంద్రనగర్
సీఎం కేసీఆర్ సార్‌కు కృతజతలు
నాకు డబుల్ బెడ్ రూం ఇల్ల్లు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ సార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. మా సొంతింటి కలను నెరవేర్చిన తెలంగాణ ముఖ్యమంత్రికి మా కుటుంబ స భ్యులమంతా జీవితాంతం రుణపడి ఉం టాం. ఎన్నికల సమయంలో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల పక్షపాతి కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లోనూ గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకుంటాం.
– మీనాక్షి, లబ్ధిదారు, యాకుత్‌పుర, శంకర్పల్లి
పేదల పక్షపాతి సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ నిరు పేదల పక్షపాతి. మేం కిరాయి ఇంట్లో ఉంటూ జీవిస్తున్నాం. ఇప్పుడున్న జీవన విధానానికి మా జీవితంలో సొంతింట్లో ఉంటామని కలలో కూడా అనుకోలేదు. మా కుటుంబ సభ్యుల కలను నెరవేర్చిన సీఎం కేసీఆర్ సార్ కు మా కుటుంబ సభ్యులమంతా జీవితాం తం రుణపడి ఉంటాం. తెలంగాణ రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి చేసు కోవాలంటే కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవా ల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
– వరలక్ష్మి కార్వాన్, లబ్ధిదారు, యాకుత్‌పుర, శంకర్పల్లి
సీఎం కేసీఆర్‌ను మళ్లీ గెలిపించుకుంటాం
మా సొంతింటి కలను నెరవేర్చి మా కుటుం బానికి గూడు కల్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్ సార్‌ను మళ్లీ గెలిపించుకుని రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాం. పెరిగిన భూ ముల ధరలతో మేము సొంతింట్లో ఉంటామ ని అనుకోలేదు. సీఎం కేసీఆర్ పుణ్యమా అని సొంతింట్లో కాలు పెట్టాం. రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలంటే ప్రజల కష్టాలు తెలిసిన కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి.
– మానస, లబ్ధిదారు, యాకుత్‌పుర, శంకర్పల్లి
మా కల నెరవేరింది..
జీవితంలో సొంతింట్లో ఉండాలనే మా కల నెరవేరింది. ఎన్నో కష్టాలు పడి జీవితాన్ని సాగి స్తున్న మాలాంటి పేద వారికి సొంత ఇల్లు అనే ది ఒక వరం. అలాంటిది మాకు డబుల్ బెడ్ రూం ఇల్లు రావడం ఎంతో ఆనందంగా ఉన్న ది. సమాజంలో గౌరవంగా బతికేందుకు ఇల్లు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు పాదాభివందనాలు. రా ష్ట్రం మరింత అభివృద్ధి చెందడంతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేసే సీఎం కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు కావాలి.
– మంజుల, లబ్ధిదారు, యాకుత్‌పుర, శంకర్పల్లి
సీఎం కేసీఆరే మాకు దేవుడు
సీఎం కేసీఆర్ మాకు డుబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చి దేవుడయిండు. అద్దెకు ఉంటూ కూలీ నాలీ చేసుకుంటూ జీవిస్తున్నాం. డబుల్ బెడ్ రూం ఇల్లు రావడంతో సొంతింటి కల నెరవే రింది. ఇక నుంచి అద్దె భారం తగ్గుతుందని ఇల్లు రావడంతో ధైర్యం పెరిగింది. పేదోళ్లకు మంచి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా చూస్తా.
– పి నాగమ్మ, సైదాబాద్
మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉన్నది
ముగ్గురు ఆడపిల్లలతో అద్దె ఇంట్లో ఉంటూ అనేక కష్టాలు పడుతున్నాం. సమయానికి అద్దె చెల్లించలేక, పిల్లల చదువులు, ఇతర ఖర్చులకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ దేవుడిలా సొంతింటిని ఇచ్చాడు. ఈ సంతోషం మాటల్లో చెప్పలేను. మా జీవితాలకు కేసీఆర్ సార్ దేవుడు, ఆయన రుణం తీర్చుకోలేనిది. ఇకపై నెల తిరగ్గానే అద్దె చెల్లించాలన్న గుబులు ఉండదన్న ఆలోచనే రెట్టింపు సంతోషానిస్తున్నది.
– గీతా మోహన్, మార్తాండనగర్, కొండాపూర్