పట్టు బిగిస్తున్న బీఆర్ఎస్..
కాంగ్రెస్ పార్టీలో చేరిన జడ్పీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం ప్రకటించిన బీఆర్ఎస్ జడ్పీటీసీలు జడ్పీ పీఠాన్ని దక్కించుకునేలా పట్టు బిగిస్తున్నారు.
- జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు బీఆర్ఎస్ సభ్యులు దూరం
- జడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు మరో ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు మాత్రమే హాజరు
- స్టాండింగ్ కమిటీ సమావేశాలకు వెళ్లని 14 మంది బీఆర్ఎస్ జడ్పీటీసీలు
- కేవలం రెండు కమిటీలతోనే ముగింపు
వికారాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీలో చేరిన జడ్పీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం ప్రకటించిన బీఆర్ఎస్ జడ్పీటీసీలు జడ్పీ పీఠాన్ని దక్కించుకునేలా పట్టు బిగిస్తున్నారు. ఇప్పటికే నిర్ణీత సమయంలోగా బలపరీక్ష నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ జడ్పీటీసీలు అవిశ్వాసం ప్రవేశపెడితే నెగ్గేలా పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు బీఆర్ఎస్ జడ్పీటీసీలు అందరూ దూరంగా ఉండి ఐక్యతను చూపించారు. జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు కేవలం నలుగురు సభ్యులు మాత్రమే హాజరుకావడంతో నామమాత్రంగా అర్ధగంటలో సమావేశాన్ని ముగించి జడ్పీ చైర్పర్సన్ వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఈ సమావేశాలకు హాజరుకావాలని బీఆర్ఎస్ జడ్పీటీసీలకు స్వయంగా జడ్పీ చైర్పర్సన్ ఫోన్ చేసినా ఎవరూ స్పందించకపోవడంతో తూతూ మంత్రంగా రెండు కమిటీ సమావేశాలను నిర్వహించారు. జడ్పీ స్టాండింగ్ సమావేశాలకు సంబంధించి వ్యవసాయంతోపాటు గ్రామీణాభివృద్ధి, ఆర్థిక-ప్రణాళిక, వైద్యారోగ్యం-విద్య, సాంఘిక సంక్షేమం, మహిళా సంక్షేమం, పనులకు సంబంధించిన ఏడు స్టాండింగ్ కమిటీలు ఉంటాయి.
సోమవారం నిర్వహించిన జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు జడ్పీ చైర్పర్సన్(కోట్‌పల్లి జడ్పీటీసీ)తోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దేముల్, బంట్వారం జడ్పీటీసీలు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరిన బషీరాబాద్ జడ్పీటీసీ సమావేశానికి హాజరయ్యారు.
మిగతా 14 మంది బీఆర్ఎస్ జడ్పీటీసీలు ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు దూరంగా ఉన్నారు. ప్రతి స్టాండింగ్ కమిటీలోనూ ఇద్దరు సభ్యుల కోరం ఉంటేనే సమావేశం నిర్వహించేందుకు వీలుంటుంది. కేవలం నలుగురు సభ్యులు మాత్రమే ఉండడంతో పనుల కమిటీతోపాటు సాంఘిక సంక్షేమ కమిటీలకు సంబంధించిన సమావేశాలను నిర్వహించి ముగించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

