రంగారెడ్డి, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ)/వికారాబాద్: పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రంగారెడ్డి, వికారాబాద్ కలెక్టరేట్ల ఎదుట గ్రా మ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ)ఆధ్వర్యం లో నిర్వహించిన ఈ ధర్నాలో పంచాయతీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డిలో నిర్వహించిన కా ర్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పాండు, శ్రామిక మహిళా రంగారెడ్డి జిల్లా కన్వీనర్ కవిత మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో 52వేల మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారని, ఇచ్చే అతి తక్కువ వేతనాలను నెలల తరబడిగా చెల్లించకపోవడంతో కార్మికులు అప్పులపాలై ఇబ్బందులు పడుతున్నారన్నా రు.
ప్రభుత్వ తీరుతో దసరా పండుగకు పస్తులుండే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందన్నారు. అధికారంలోకి రాగానే పంచాయతీ కార్మికుల వేతనాలను పెంచి పర్మినెంట్ చేస్తామని కాం గ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిందని, ఆ పార్టీ మాటలు నమ్మి కార్మికులం తా ఓట్లేసి గెలిపించారన్నారు. పది నెలల ప్రజాపాలనలో నేటికీ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయకపోగా..పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయడంలేదన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ వరర్స్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృ తం చేస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం కలెక్టర్ శశాంకకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ ధర్నాలో సీఐటీయూ జిల్లా నాయకులు కృష్ణ, పెంటయ్య, బలరాజ్, జీపీ యూనియన్ నాయకులు జగన్, కృష్ణ, జంగయ్య, రవనీల, ఆశీర్వాదం, సాలమ్మ, ఆండాళు, లలిత, గాలయ్య, శంకరయ్య, సు నీత, యాదయ్య, జంగయ్య పాల్గొన్నారు.
మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి
ప్రభుత్వం పెండింగ్ వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు పండుగ పూ ట పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందని వికారాబాద్ జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు మహిపాల్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, చంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ గ్రామ పం చాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో పంచాయ తీ కార్మికులు ధర్నా నిర్వహించారు. పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశా రు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్య క్ష, ఉపాధ్యక్షులు మాట్లాడుతూ..ప్రభుత్వం వెంటనే పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ లింగ్యానాయక్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నర్సింహులు, వెంకట ప్ప, బసప్ప, రాములు, అంబరప్ప, చందు, శ్యామప్ప, షబ్బీర్, లక్ష్మి, మొగులమ్మ, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.