కడ్తాల్, మార్చి 12 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో.. రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు అభివృద్ధి సాధించాయని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎల్ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ వేడుకులను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, నాయకులు, అభిమానులు కేసీఆర్ చిత్రపటానికి రంగులు చల్లి సంబురాలు చేసుకున్నారు. మహిళల సంక్షేమానికి బీఆర్ఎస్ పాలనలో అనేక పథకాలు అమలు చేశారని మహిళలు కొనియాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయంలో జరిగిన అభివృద్ధే గ్రామాల్లో కనిపిస్తున్నదని తెలిపారు. కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్ను… మహిళలు పెద్దన్నలాగా, మేనమామలాగా భావిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధినే గుర్తు చేసుకుంటున్నారన్నారు.