దళిత కుటుంబాల్లో వెలుగులు నింపిన దళితబంధు పథకంపై నీలినీడలు అలుముకున్నాయి. ఈ పథకం కొనసాగింపుపై కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి ప్రకటనలూ చేయకపోవడంతో దళిత కుటుంబాల్లో సందిగ్ధత నెలకొన్నది. ఇటీవల స్పీకర్ ప్రసాద్‌కుమార్, జిల్లా ఎమ్మెల్యేలు నిర్వహించిన అధికారుల సమావేశానికి ఎస్సీ కార్పొరేషన్ ఈడీని హాజరుకావాలని ఆదేశించకపోవడంతో దళితబంధు నిలిపివేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో దళిత కుటుంబాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఏదేమైనా దళితబంధు పథకాన్ని కొనసాగించాల్సిందేనంటూ కలెక్టర్, సంబంధిత అధికారులకు వినతులు వెల్లువెత్తుతున్నాయి.
కేసీఆర్ సర్కార్ మొదటి విడుత లబ్ధిదారులకు అందించిన ఆర్థికసాయంతో తమకు నచ్చిన వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా రాణిస్తున్నారు. ఇక రెండో విడుత కోసం వికారాబాద్ జిల్లాకు రూ.60 కోట్లను కేటాయించిన కేసీఆర్ ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికనూ చేపట్టింది. ఇంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో రెండో విడుత ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది. దళితబంధును కొనసాగించేందుకు కాంగ్రెస్ సర్కార్ సుముఖంగా లేకపోవడంతో రెండో విడుతలో భాగంగా విడుదలైన రూ.60 కోట్ల నిధుల మళ్లింపు జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఇప్పటికే రూ.40 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. దళితబంధు పథకంపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలనే డిమాండ్ వెల్లువెత్తుతున్నది.
-వికారాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): దళిత కుటుంబాల్లో వెలుగులు నింపిన దళితబంధు పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి.. దళిత కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసిన దళితబంధు పథకాన్ని ప్రస్తుతం కొనసాగిస్తుందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొన్నది.
ఇటీవల స్పీకర్ ప్రసాద్‌కుమార్‌తోపాటు జిల్లా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశానికి కూడా ఎస్సీ కార్పొరేషన్ ఈడీని హాజరు కావాలని ఆదేశించకపోవడం గమనిస్తే దళితబంధును నిలిపి వేస్తారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దళితబంధు పథకాన్ని రద్దు చేస్తారని ప్రచారం జరుగుతుండడంతో దళిత కుటుంబాలు జిల్లా కలెక్టర్‌తోపాటు సంబంధిత అధికారులకు దళితబం ధు పథకాన్ని కొనసాగించాలంటూ విన్నవించా రు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దళితబంధు పథకం కొనసాగింపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

దళితబంధు పథకంలో భాగంగా మొదటి విడుత కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు వారికి నచ్చిన వ్యాపారాలు చేసుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా రూ.10లక్షలను బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసింది. దీంతో మొదటి విడుతలో ఎంపికైన లబ్ధిదారుల కుటుంబాల్లో వెలుగులు నిండా యి. దళితబంధు రెండో విడుత ప్రక్రియను షు రూ చేసే సమయంలోనే ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రక్రియ లబ్ధిదారుల ఎంపికతోనే మ ధ్యంతరంగా నిలిచిపోయింది. రెండో విడుత దళితబంధు పథకం అమలుకు జిల్లాకు రూ.60 కోట్ల నుగత ప్రభుత్వం విడుదల చేసింది.
ప్రస్తుత ప్ర భుత్వం మాత్రం ఈ పథకం అమలుకు సానుకూలంగా లేకపోవడంతో దళితబంధు పథకం అమలుకు విడుదలైన రూ.60 కోట్ల నిధుల మళ్లింపు జరిగిందనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే రూ.40కోట్లను ప్రస్తుతం వెనక్కి తీసుకున్నట్లు స మాచారం. మరీ దళితబంధు పథకం కొనసాగనున్నదా, ఇప్పటికే విడుదల చేసిన నిధులను దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు చేస్తారా అనే దానిపై ప్రభుత్వం నుం చి స్పష్టత రావాల్సి ఉన్నది.
ఆర్థిక చేయూతతో పాటు శిక్షణ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత కుటుంబాలు ఎంపిక చేసుకున్న వ్యాపారాలకు సంబంధించి ఆర్థిక చేయూతనందించడంతోపాటు ఆ యా రంగాల్లోని నిపుణులతో ప్రత్యేక అవగాహన కల్పించడంతోపాటు శిక్షణ ఇప్పించారు. దళితబంధు లబ్ధిదారులు వారు ఎంచుకున్న వ్యాపారాల్లో నష్టపోతే వారిని ఆర్థికంగా అండగా ఉం డేందుకు ఏర్పాటు చేసిన రక్షణ నిధి కింద రూ.35.80 లక్షల నిధులను సంబంధిత అధికారులు జమ చేశారు. మరోవైపు మొదటి విడుతలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 358 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, జిల్లాకు రూ.35.80 కోట్ల నిధులను విడుదల చేయగా, 358 యూనిట్లకు సంబంధించి జిల్లా యంత్రాం గం గ్రౌండింగ్ చేశారు. జిల్లాలో మొదటి విడుత లో మంజూరైన యూనిట్లలో వికారాబాద్ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులు, తాండూరులో 100, పరిగిలో 80, కొడంగల్‌లో 60, చే వెళ్లలో 18 యూనిట్ల గ్రౌండింగ్ చేశారు.
దళితబంధు పథకంలో భాగంగా మొదటి విడుతలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక చేయూతనందించిన జిల్లాలోని దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. గతంలో కూలీ పని చేసి జీవనోపాధి పొందిన వారు.. దళితబంధు పథకంలో భాగంగా ఆర్థిక సహాయం అందజేయడంతో రూ.10లక్షల విలువ చేసే యూనిట్లు సొంతం కావడంతో పాటు దండిగా ఉపాధి పొందుతున్నారు. అయితే దళితబంధు పథకంతో గతంలో కారు డ్రైవర్లుగా పని చేసిన వారు… నేడు ఓనర్లయ్యారు, హోటళ్లలో పని చేసే వారు హోటళ్లకు ఓనర్లయ్యారు. అయితే జిల్లాలో లబ్ధిదారులు మినీ డెయిరీ, పౌల్ట్రీపామ్లతోపాటు కార్లు, ట్రాక్టర్ యూనిట్లను లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారు.