బుధవారం 28 అక్టోబర్ 2020
Rangareddy - Sep 26, 2020 , 00:51:55

కొత్తగూడలో పండ్ల మొక్కలు పెంపకం

కొత్తగూడలో పండ్ల మొక్కలు పెంపకం

 కేసీఆర్‌ పుట్టిన రోజున 150 మొక్కలు నాటిన అధికారులు

  కందుకూరు :  అడవులు పెంచాలి, కోతులు వాపస్‌ పోవాలి అని సీఎం కేసీఆర్‌ పిలుపు ఇవ్వడంతో మండల పరిధిలోని కొత్తగూడలో పండ్ల మొక్కలను పెంచుతున్నారు. అంతరించి పోతున్న అడవులతో వానరులకు ఆహారం దొరకడం లేదు. దీంతో సీఎం కేసీఆర్‌ గ్రామాల్లో పండ్ల తోటలను పెంచాలని ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా పయనిస్తున్నారు. కలెక్టరు అమోయ్‌కుమార్‌ ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లాలో పండ్ల మొక్కలను పెంచి వానరులకు పండ్లను అందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా  కొత్తగూడలో ప్రభుత్వ స్థలంలో సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా 150 పండ్ల మొక్కలను నాటారు.  అట్టి మొక్కలను మంత్రి సబితాఇంద్రారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ ఇటీవల పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.

మొక్కలు పెంచడం ఆనందంగా ఉంది

 సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా తమ గ్రామంలో పండ్ల మొక్కలు పెంచడం ఆనందంగా ఉంది. దీనికి సీఎం కేసీఆర్‌ పేరు పెడుతాం.  పండ్ల మొక్కల పెంపు నకు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు.

                     -సాధ మల్లారెడ్డి, సర్పంచ్‌, కొత్తగూడ

ప్రతి ఒక్కరం కృషి చేస్తున్నాం

  పంచాయతీ సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరం పండ్ల మొక్కల పెంపు కోసం కృషి చేస్తున్నాం. ట్రీ గార్డులను ఏర్పాటు చేసి సిబ్బంది కంటికి రెప్పాల కాపాడుతున్నా రు. అధికారులు సూచనలు, సలహాలు పాటిస్తున్నాం. 

              -శివశంకర్‌, పంచాయతీ కార్యదర్శి


logo