పెద్దఅంబర్‌పేట, మే 25: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కళాకారులు ముఖ్యపాత్ర పోషించారు. రాష్ట్రంలో వృత్తి కళాకారులకు గుర్తింపు లేక జీవనాధారం కష్టంగా మారందని, ప్రభుత్వం వారికి నెలనెలా పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజానాట్యమండలి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి డీ వేణుగోపాలాచారి అధ్యక్షతన ఐపీటీఏ 82వ ఆవిర్భావ దినోత్సవాన్ని రావినారాయణరెడ్డి కాలనీ ఫేజ్2లో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు ఆందోజు రవీంద్రాచారి, ముత్యాల యాదిరెడ్డి, పబ్బతి లక్ష్మణ్, హరిసింగ్‌నాయక్ ఐపీటీఏ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల్లో చైతన్యం నింపేలా కళారూపాలు తయారు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు సైదులు, రాము, శేఖర్, భాస్కర్, సరస్వతి, విజయ్, అడివయ్య, సావిత్రి, శైలజ, మహేశ్, పరశురాములు, రమేశ్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.