కౌంటింగ్ను సజావుగా చేపట్టాలి
నిబంధనలు పక్కాగా పాటిస్తూ.. ఓట్ల లెకింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక సూచించారు. చేవెళ్ల మండలం గొ ల్లపల్లి గ్రామంలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో జూన్ 4న చేపట్టనున్న చేవెళ్ల లోక్సభ ఓట్ల లెకింపును పురసరించుకుని కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రోఅబ్జర్వర్లకు మంగళవారం కలెక్టరేట్లోని స మావేశ మందిరంలో శిక్షణా తరగతులు నిర్వహించారు.
- శిక్షణా తరగతుల్లో రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక
రంగారెడ్డి, మే 28 (నమస్తే తెలంగాణ): నిబంధనలు పక్కాగా పాటిస్తూ.. ఓట్ల లెకింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక సూచించారు. చేవెళ్ల మండలం గొ ల్లపల్లి గ్రామంలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో జూన్ 4న చేపట్టనున్న చేవెళ్ల లోక్సభ ఓట్ల లెకింపును పురసరించుకుని కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రోఅబ్జర్వర్లకు మంగళవారం కలెక్టరేట్లోని స మావేశ మందిరంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. కౌంటింగ్ నిర్వహణ సం దర్భంగా పాటించాల్సిన నిబంధనలు, అనుసరించాల్సిన పద్ధతులను పవర్ పాయిం ట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈవీఎంల ఓట్ల లెకింపు ఎలా చేయాలి? పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఎలా లెక్కించాలి..? అనే అంశాలపై సంబంధిత అధికారులు, సిబ్బందికి వేర్వేరుగా శిక్షణఇచ్చారు. పలువురు కౌంటింగ్ సిబ్బంది వ్యక్తపరిచిన సందేహాలను మాస్టర్ ట్రైనర్లు నివృత్తిచేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. చేవెళ్ల లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల లెకింపు పకాగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం 6 గంటలకు కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెకింపు కేంద్రానికి చేరుకోవాలని, ర్యాండమైజేషన్ ప్రక్రియ అనంతరం వారికి ఆయా సెగ్మెంట్ల వారీగా టేబుళ్లను కేటా యించడం జరుగుతుందన్నారు. ఓట్ల లెకింపు కోసం మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 28 టేబుళ్లు, మిగతా నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లయిన చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరులకు సంబంధించి 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెకింపును త్వరగా పూర్తి చేయాలని.. ఎకడా పొరపాట్లకు ఆసారం ఇవ్వొద్దన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తిరసరణకు గురైతే అందుకు గల కారణా లను అభ్యర్థులు, వారి ఏజెంట్లకు స్పష్టంగా తెలపాలన్నారు. ఈవీఎంల ఓట్లను రౌండ్ల వారీగా జాగ్రత్తగా లెకిస్తూ, ప్రతి రౌండ్కూ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాల న్నారు. ఓట్ల లెకింపు సం దర్భంగా సమస్యలొస్తే సహాయ రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కౌంటింగ్ సెంటర్లో అన్ని వసతులు అందుబాటులో ఉంటాయని.. సెల్ఫోన్లకు అనుమతి లేదన్నారు. శిక్షణా తరగతుల్లో డీఆర్వో సంగీత, సహాయ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

