వికారాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వంలో స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకున్న పల్లెల్లో ప్రస్తుతం పాలన పడకేసింది. పల్లెప్రగతి కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొ చ్చి దేశంలో ఎక్కడాలేని విధంగా పచ్చని పల్లెలుగా అవార్డులను సొంతం చేసుకున్న గ్రామ పంచాయతీల్లో పాలన గత 15 నెలలుగా అస్తవ్యస్తంగా మా రింది. రేవంత్ సర్కార్ ఇప్పటివరకు గ్రామ పంచాయతీలకు నయా పైసా నిధులివ్వకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయి. అదేవిధంగా పల్లెల్లో గతేడాదిగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. ప్రత్యేకాధికారులను నియమించారే తప్పా కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోవడం, రాష్ట్ర ప్రభు త్వం ఒక్క రూపాయీ జీపీలకు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతున్నది.
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే పంచాయతీ కార్మికులకు ఏడెనిమిది నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వా రు పారిశుధ్య నిర్వహణపై శ్రద్ధ చూ పక పోవడంతో ఎక్కడ చూసినా ము రుగునీటి ప్రవాహం, చెత్తాచెదారమే దర్శనమిస్తున్నది. అదేవిధంగా కనీసం డ్రైనేజీ పైపులైన్కూ మరమ్మతులు చేయలేని దుస్థితి నెలకొనడంతో గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. బీఆర్ఎస్ హయాంలో అద్దంలా మెరిసిన గ్రామ పంచాయతీల్లోని రోడ్లు ప్రస్తుతం మురుగు నీటితో దర్శనమిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఇచ్చి న ట్రాక్టర్లు కూడా ప్రస్తుతం మూలనపడ్డాయి. దీం తో ప్రతిరోజూ ఇంటింటి నుంచి సేకరించే చెత్త గ్రా మాల్లో నిలిచిపోవడంతో ఎక్కడ చూసినా చెత్తాచెదారమే కనిపిస్తున్నది. గతేడాది వేసవిలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చేసిన మరమ్మతులకు సంబంధించిన నిధులను ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదు. ఆ మొత్తం దాదాపుగా రూ. నాలుగు కోట్ల వరకు ఉన్నది.