నందిగామ, జూలై 9 : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం మేకగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడావత్ రాజు, పాత్లావత్ భాస్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు.
రానున్న రోజుల్లో కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌కు ఆదరణ పెరుగుతున్నదని, ఇతర రాష్ర్టాల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పద్మారెడ్డి, మేకగూడ పీఏసీఎస్ చైర్పర్సన్ మంజులారెడ్డి, ఎంపీటీసీ రాజూనాయక్, నాయకులు శ్రీశైలం, తిరుపతిరెడ్డి, నజీర్, శంకర్, పాండు, రమేశ్, రెడ్యా, బాబు, వినోద్, శ్రీను, దేవేందర్, లింగం, శివ, బాలరాజు, రవీందర్ పాల్గొన్నారు.
గులాబీ గూటికి కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు
ధారూరు, జూలై 9 : సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ధారూరు మండల అధ్యక్షుడు రాజూనాయక్ అన్నారు. ఆదివారం ధారూరు మండలం దోర్నాల్ గ్రామానికి చెందిన మంగళి నర్సింహులు కాంగ్రెస్ పార్టీ నుంచి, వడ్డే శ్రీనివాస్ బీజేపీ నుంచి రాజూనాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాజూనాయక్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. కేసీఆర్ సర్కార్ ఏర్పడ్డాక రైతులకు రైతు బంధు, రైతు బీమా తదితర పథకాలు ప్రవేశపెట్టి అమలుపరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, రాములు, జైపాల్‌రెడ్డి, సంతోష్‌కుమార్, వెంకటయ్య, అంజయ్య, వెంకట్రామ్రెడ్డి, రాజుగుప్తా ఉన్నారు.