మొయినాబాద్, మార్చి 8 : మండలంలోని బాకారం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ. 5లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ గ్రామానికి తహసీల్దార్ గౌతమ్‌కుమార్ ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నారు. గ్రామాల్లో ప్రభుత్వ నిధులతో చేపట్టే ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని అయినా ప్రత్యేక అధికారులు, ప్రజాప్రతినిధు లు కలిసి ప్రారంభించాలి. ప్రస్తుతం ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అన్ని పనులను ప్రత్యేక అధికారులు నిర్వహించే అధికారాన్ని ప్రభుత్వం కల్పించింది.
కానీ, ఇటీవల బాకారం గ్రామంలో రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ప్రత్యేక అధికారికి సమాచారం ఇవ్వకుండానే పంచాయతీరాజ్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. సొంత నిధులతో పనులను చేపట్టినట్లుగా అధికార పార్టీ నాయకులు సీసీ రోడ్డు పనులను ప్రారంభించడంపై ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయంపై పంచాయతీరాజ్ డీఈ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా తహసీల్దార్ గౌతమ్‌కుమార్ బాకారం గ్రామానికి ప్రత్యేక అధికారి అని అనుకోలేదని, ఇక నుంచి చేపట్టే కార్యక్రమాలకు అతడికి సమాచారం ఇస్తామ ని పేర్కొనడం కొసమెరుపు.