Mla Kishan Reddy | కాంగ్రెస్ అంటేనే అవినీతి పాలన : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
Mla Kishan Reddy | కాంగ్రెస్ పాలన అంటేనే అవినీతి పాలన అని, ఆ పార్టీ నాయకులు ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్ధి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి(Mla Kishan Reddy) ఓటర్లకు విన్నవించారు.
తుర్కయంజాల్ : కాంగ్రెస్ పాలన అంటేనే అవినీతి పాలన అని, ఆ పార్టీ నాయకులు ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్ధి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి(Mla Kishan Reddy) ఓటర్లకు విన్నవించారు. ఆదివారం తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధిలోని ఉమర్ఖాన్దాయర, కొహెడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చూసి ఓటు వేయాలని కోరారు.
ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే కాంగ్రెస్ (Congress) నాయకులను ప్రజలు విశ్వసించే స్థితిలో లేరని అన్నారు. రూ.450 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో కొహెడ వ్యవసాయ మార్కెట్(Agriculture Market) ను నిర్మిస్తామని ఇప్పటికే డీపీఆర్ సిద్ధం అయిందని తెలిపారు. నియోజకవర్గాన్ని రూ. 2931 కోట్లతో అభివృద్ధి చేయడంతో పాటుగా అనేక పరిశ్రమలు(Industries) ఏర్పాటు చేశామని తెలిపారు.
పరిశ్రమల ద్వారా నియోజకవర్గంలోని యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

