కేశంపేట, జూన్ 11 : రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని చింతకుంటపల్లి గ్రామంలో మూడెకరాల ప్రభుత్వ భూమి(పలుగు రాయి)ని కాంగ్రెస్ నాయకుడు కబ్జా చేశాడని గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు రమేశ్‌యాదవ్ ఆరోపించారు. కబ్జా విషయమై బుధవారం డిప్యూటీ తహసీల్దార్ గీతకు ఫిర్యాదు చేశారు.
అనంతరం రమేశ్ యాదవ్ మాట్లాడుతూ.. చింతకుంటపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 98లో మూడెకరాల ప్రభుత్వ భూమి(పలుగు) ఉందని, కాంగ్రెస్‌పార్టీకి చెందిన నాయకుడు పలుగు రాయిని విక్రయించుకోవచ్చనే దురుద్దేశ్యంతో రియల్ ఎస్టేట్ వ్యాపారితో ఒప్పందం చేసుకున్నాడని ఆరోపించారు. పది రోజుల క్రితం ప్రభుత్వ భూమికి దర్జాగా పెన్షింగ్ వేశారని తెలిపారు. స్థానిక రైతులు పెన్షింగ్ విషయాన్ని అడ్డుకునేందుకు వెళితే వారిని సదరు కాంగ్రెస్ నేత భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని పేర్కొన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. కబ్జా చేసిన భూమిలో పెన్సింగ్ తొలగించి ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ భూమి కబ్జా విషయం చింతకుంటపల్లి గ్రామంలో తీవ్ర కలకలం రేపుతోంది.
ప్రభుత్వ భూమిని కబ్జా చేసి పెన్సింగ్ వేసిన దృశ్యం