వికారాబాద్, మే 24 : బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అధోగతి పాలైందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.
మండలంలోని కొటాలగూడ గ్రామానికి చెందిన కురుమ మల్లేశం తన అనుచరులు దాదాపు 20 మందితో కలిసి మెతుకు ఆనంద్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్ముదిరాజ్, నాయకులు అశోక్, కమాల్రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.