పూడూరు, జూన్ 27 : పార్టీ కోసం పనిచేసే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రేగడిమామిడిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ నిర్మలామహిపాల్రెడ్డితోపాటు సుమారు వంద మంది మాజీ ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. 18 నెలల కాం గ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని.. అందుకే ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
గత కేసీఆర్ హ యాంలో అన్ని గ్రామాల్లోనూ అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్క పని కూడా సక్రమంగా జరగడంలేదని ఎద్దేవా చేశారు. రాష్ర్టాభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. కార్యక్రమం లో పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ మల్లే శం, పరిగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ హజార్, బుచ్చన్న, వెంకటయ్య, సత్యనారాయణ, రాజేందర్‌రెడ్డి, నరసింహారెడ్డి, వెంకటయ్య, అంజిరెడ్డి, రవీందర్‌రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఆంజనేయులు, శేఖర్, గోపాల్, నర్సింహులు, మహేందర్, జంగయ్య, మల్లేశ్, కుమార్, శ్రీశైలం, శేఖర్‌రెడ్డి, ప్రవీణ్, రాజు తదితరులు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు.