కడ్తాల్, ఏప్రిల్ 1 : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రేవంత్‌రెడ్డి సర్కార్ తుంగలో తొక్కిందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ విమర్శించారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్‌నాయక్, నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. బూటకపు హామీలు, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిజ స్వరూపాన్ని ప్రజలు గుర్తించారన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పేర్కొన్నారు.
కడ్తాల్ మండలానికి గురువారం మాజీ మంత్రి హరీశ్‌రావు రానున్నట్లు తెలిపారు. మండల పరిధిలోని మర్రిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ, ముద్విన్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దశరథ్‌నాయక్ ఆధ్వర్యంలో నిర్మించిన ఇంటితోపాటు, చరికొండ గ్రామపంచాయతీలో గల బోయిన్‌గుట్ట తండాలో నూతనంగా ఏర్పాటు చేసిన సంత్ సేవాలాల్ మహరాజ్, మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను హరీశ్‌రావు ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి హరీశ్‌రావు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులకు విరక్తి వచ్చి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు.
మండల పరిధిలోని కర్కల్‌పహాడ్ గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ శ్రీను, బిచ్యానాయక్, బీరయ్య, కృష్ణయ్య, మల్లయ్య, మహేశ్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ ఆయన గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం, మాజీ జడ్పీటీసీలు, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల అధ్యక్షులు, తెలంగాణ బీసీ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, మాజీ వైస్ ఎంపీపీలు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, పీఏసీఎస్ డైరెక్టర్ వీరయ్య, నాయకులున్నారు.