వికారాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కబ్జాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ము ఖ్యంగా పలు మండలాల్లోని కాంగ్రెస్ నాయకులు బరితెగిస్తున్నారు. వారి అండతో రియల్టర్లు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పేదలు సాగు చేసుకుని బతికేందుకు ఇచ్చిన ప్రభుత్వ, అసైన్డ్ భూ ములను ఆక్రమించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లపాటు ప్రభుత్వ, అసైన్డ్ భూములను కాపాడితే.. రేవంత్ సర్కార్ వచ్చిన నాటి నుంచే కబ్జాల పర్వం ప్రారంభమైంది.
కాంగ్రెస్ నాయకులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై భూదందాకు పాల్పడుతున్నారనే ప్రచారమూ జోరుగా సాగుతున్నది. అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా జిల్లాలోని యాలాల మండలంలోని కోకట్తోపాటు వికారాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న కొత్రేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అసైన్డ్ భూమిని దర్జాగా కబ్జా చేసి ప్రైవేట్ వెంచర్‌కు రోడ్డును నిర్మించాలని పలువురు పేర్కొంటున్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు, అనంతగిరి టూ రిజం పేరిట వెంచర్లు ఏర్పాటు చేస్తున్న రియల్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యే పూడూరు మండలం లోని ఎన్కెపల్లి పంచాయతీ పరిధిలో ఏ ర్పాటు చేస్తున్న ఓ ప్రైవేట్ వెంచర్ నిర్వా హకులు రైతులు విక్రయించకుండానే స్థానిక రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై వారి పేరిట రైతుల భూమిని మార్చుకున్న ఘటన మరువక ముందే ఆ వెంచర్‌కు సమీపంలో వెలసిన మరో వెంచర్ నిర్వాహకులు ఏకంగా అసైన్డ్ భూమినే కబ్జా చేసి రోడ్డును నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వికారాబాద్ మండలంలోని కొత్రేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వేనంబర్ 164లో ప్రభుత్వం అప్పట్లో పలువురు రైతులకు అసైన్డ్ పట్టాలను అందజేసింది. ఆ సర్వేనంబర్‌లో మిగిలి ఉన్న మి గతా అసైన్డ్ భూమికి ఆనుకొని మద్దులగడ్డతండాకు వెళ్లే రోడ్డు వరకు 15 ఫీట్ల నక్ష రోడ్డు కూడా ఉన్నది. ఆ రోడ్డు దాటిన తర్వాత మొత్తం ప్రభుత్వ భూమే ఉన్నది. దానిని అదునుగా భావించిన కొందరు రియల్టర్లు 15 ఫీట్ల రోడ్డులోనే ఓ వెంచర్ ను ఏర్పాటు చేసి..దాని పక్కనే ఉన్న అసై న్డ్ భూమిని కబ్జా చేసి 40 ఫీట్ల రోడ్డుగా రాత్రికి రాత్రే ఏర్పాటు చేశారని స్థానికులు ఆరోపి స్తున్నారు.
అయితే, ఆ రోడ్డు నిర్మాణానికి భూములిస్తే డబ్బు ఇస్తామని అసైన్డ్‌దారులకు ఆశ చూపారని.. రోడ్డు నిర్మాణం పూర్తి కాగానే ఆ రియల్టర్లు రైతులను పట్టించుకోకపోవడంతో ఈ కబ్జా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందన్నారు. ఇం త జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని.. వారికి భారీగా డబ్బులు అందినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. ఈ కబ్జా వ్యవహారాన్ని కాంగ్రెస్‌కు చెందిన ఓ నాయకుడు వెనుక ఉండి నడిపించారనే ప్రచారం జరుగుతున్నది.
కాంగ్రెస్ నాయకుల అండతో జిల్లాలో రియల్టర్లు దర్జాగా అసైన్డ్ భూములను కబలించి.. వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారని.. వారికి అధికారులూ వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలున్నాయి. యాలాల మండలంలోని కోకట్ పంచాయతీ పరిధిలోని సర్వేనంబర్ 64లోని రూ. కోటి విలువైన ఎకరం అసైన్డ్ భూమిని ఓ రియల్టర్ కబ్జా చేసి ప్రహరీ ఏర్పాటు చేసినా రెవె న్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వారికి ముడుపులు అందడం తో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
అయితే ఆ రియల్టర్‌కు స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అండ పుష్కలంగా ఉన్నదనే ప్రచారమూ జరుగుతున్నది. ఇటీవల తాండూరు సెగ్మెంట్‌కు చెందిన ప్రజాప్రతినిధులతో డీల్ కుదిరిన తర్వాతే వారి అండతోనే ఈ కబ్జాకు పాల్పడినట్లు సమాచారం. అసైన్డ్ భూమి కబ్జా వ్యవహారాన్ని ఓ రెవెన్యూ అధికారే నడిపించినట్లు.. ఆ భూమిని పట్టా భూమిగా మార్చేందుకు రికార్డులనూ తారుమారు చేసేందుకు ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతున్నది.