కాంగ్రెస్ నాయకులు కనబడటంలేదు..
ఫార్మా బాధిత రైతులు శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టగా.. అక్కడ ఒక ఫ్లెక్సీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
- ఎంత వెతికినా దొరకడంలేదు
- ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీ భూములను కాపాడుతామన్నారు..
- ఇప్పుడేమో పత్తాలేరు
- హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో ఆకట్టుకున్న ఫ్లెక్సీ
- కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ఫార్మాసిటీ బాధితుల ధర్నా
యాచారం, మే 30 : ఫార్మా బాధిత రైతులు శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టగా.. అక్కడ ఒక ఫ్లెక్సీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిలు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫార్మాసిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని రైతులతో కలిసి పాదయాత్ర చేశారు. ఫార్మాసిటీ ఏర్పాటు దుర్మార్గమని.. దానితో ప్రజలకు హాని జరుగుతుందని.. దానిని ఏర్పాటు చేయొద్దని.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిన భూములను తిరిగి అన్నదాతలకు అప్పగిస్తామని ప్రగల్బాలు పలికి ఓట్లు దండుకుని.. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి పదవులు దక్కడంతో ప్రస్తుతం కనబడటంలేదు.. ఎక్కడ వెతికినా దొరకడంలేదని ఇందిరాపార్కు వద్ద వారి ఫొటోలతో కూడి న ఫ్లెక్సీని ఫార్మాసిటీ బాధిత రైతులు ఏర్పా టు చేశారు. ఆ దారిలో రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులు, స్థానికులను ఎంతో ఆకట్టుకున్నది. ఈ ఫ్లెక్సీ కాంగ్రెస్ నాయకుల మోసాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేసింది. అంతేకాకుండా ఆ ధర్నాలో రేవంత్ సర్కార్ మోసంపై రైతులు పాడిన పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

