హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఇన్ సర్వీస్ టెట్ స్టడీ మెటీరియల్ను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ జీ రమేశ్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ పరీక్షకు హాజరయ్యే టీచర్ల కోసం ఎస్టీయూ టీఎస్ ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ను రూపొందించింది.
ఈ సందర్భంగా ఎస్టీయూ టీఎస్ చొరవను రమేశ్ ప్రత్యేకంగా అభినందించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ సదానందం గౌడ్ మాట్లాడుతూ రెండు పేపర్లకు పదివేల పుస్తకాలు ముద్రించామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి గజేందర్, ఎం పర్వత్రెడ్డి, ఎల్ఎం ప్రసాద్ పాల్గొన్నారు.