రంగారెడ్డి, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలను కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడు పరిష్కరిస్తుందో నని జిల్లాప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ఉన్న రెవెన్యూ సంబంధిత సమస్యలను తాము అధికారంలోకి రాగానే వాటిని భూభారతి అనే పోర్టల్‌ను తీసుకొచ్చి పరిష్కరిస్తామని చెప్పిన పాలకులు..16 నెలల తర్వాత సోమవారం శిల్పారామంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూభారతిని లాంఛనంగా ప్రారంభించారు. కాగా, ఈ పోర్టల్‌పై రెవెన్యూ యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండానే ఆవిష్కరించారు.
ఇప్పటివరకు రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులను కోరితే.. త్వరలో నే భూభారతి వస్తుందని.. రాగానే అన్నింటినీ క్లియర్ చేస్తామని చెప్పారని పలువురు రైతులు, ప్రజలు పేర్కొంటున్నారు. జిల్లాలో భూసంబంధిత సమస్యలు అత్యధికంగా ఉన్నాయి. గతంలో కలెక్టర్లు తరచూ మార డం ఒక కారణం కాగా, ఆరు నెలల కిందట జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏసీబీకి పట్టుబడడం వంటి పరిణామాలతో రెవెన్యూ కేసుల సం ఖ్య పెరిగిపోయింది. రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు రెవెన్యూ, ఆర్డీవో, కలెక్టరేట్ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభమైన భూ భారతితో సమస్యలకు పరిష్కారం లభిస్తుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది.
జిల్లాలో సుమారు 20 వేలకు పైగానే రెవెన్యూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. రంగారెడ్డి కలెక్టర్‌గా నారాయణరెడ్డి విధుల్లో చేరిన తర్వాత పెండింగ్ సమస్యల పరిష్కారానికి స్పెషల్‌డ్రైవ్ పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను తిరిగి ఆయా తహసీల్దార్లకు పంపించి.. విచారించి నివేదికను పంపాలని ఆదేశించారు. కాగా, తహసీల్దార్లు అరకొరగా పరిష్కరించి.. మిగతా వాటిని పెండింగ్‌లో ఉంచారు. ముఖ్యంగా, జిల్లాలో రెవెన్యూ అదనపు కలెక్టర్ లేకపోవడంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆ అదనపు కలెక్ట ర్ తన బాధ్యతలతోపాటు రెవెన్యూ సమస్యలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో అవి పరిష్కారానికి నోచుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
జిల్లాలో అత్యధికంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల్లో టీఎం-33కి సంబంధించినవి ఉన్నాయి. ఇవి ఆర్డీవో, తహసీల్దార్, డీటీ లాగిన్లలో పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే, మ్యుటేషన్లు, కోర్టు కేసుల ద్వారా అందించాల్సిన పాస్‌బుక్కులు, నిషేధిత జాబితా నుంచి పేర్ల తొలగింపు వంటివీ ఉన్నాయి. ముఖ్యం గా సంబంధంలేని భూములను సైతం అధి కారులు నిషేధిత జాబితాలో చేర్చారు. జిల్లా పరిధిలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో భూములపై తమకూ వాటా రావాలని ఎక్కువ మంది కేసులేశారు. తల్లిదండ్రు ల భూముల్లో కుమార్తెలు వాటాల కోసం కేసులేశారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో ని ఆదిబట్ల గ్రామంలో సర్వేనంబర్ 329లో ఒక రియల్ఎస్టేట్ సంస్థ కొంత భూమిని కొ ని ప్లాట్లుగా మార్చి విక్రయించింది. అయితే ఆ సంస్థపై ఐటీ అధికారులు జరిపిన దాడుల సందర్భంగా ఆ ప్లాట్ల క్రయవిక్రయాలపై నిషే ధం విధించాలని ఆదేశాలు జారీచేశారు. కానీ, అధికారులు మాత్రం ఆ సర్వేనంబర్ మొత్తంతోపాటు.. ఆ ప్లాట్లతో సంబంధం లే ని భూములనూ నిషేధిత జాబితాలో చేర్చా రు. తమ భూములను నిషేధిత జాబితా నుం చి తొలగించాలని రైతులు కోరుతున్నా ఫలితం లేదు.
ధరణితో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఇన్ని రోజులు పెండింగ్‌లో పెట్టిన అధికారులు.. భూ భారతితోనైనా పరిష్కరిస్తారా..? అనేది తెలియాల్సి ఉన్నది. భూ భారతిలో ఎలాంటి సమస్యలను పరిష్కరిస్తారు..ఎంత సమయం పడుతుందనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఏండ్లుగా తిరుగుతున్నా మా రెవెన్యూ సమస్య లు పరిష్కారం కావడం లేదు.
-రజినీకాంత్‌రెడ్డి, బాషమోనిగూడ
కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన పోర్టల్‌తో రెవెన్యూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమైనా.. కావాలనే కాంగ్రెస్ సర్కార్ నెలల తరబడిగా పెండింగ్‌లో పెట్టింది. ఆ పోర్టల్‌తో సమస్యలు పరిష్కారం కావడంలేదని గొప్పకోసం భూభారతిని తీసుకొ చ్చింది. ఈ పోర్టల్‌తో సమస్యలు పరిష్కారమవుతాయా.. ? అనే సందిగ్ధంలో రైతులు, ప్రజలు ఉన్నారు.
-బుట్టి చంటి, ఎలిమినేడు