రంగారెడ్డి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రంగారెడ్డి జిల్లా జిల్లెడు చౌదరిగూడ మండలం గాలిగూడ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..టీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెల్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హాఫీజ్, నాయకులు కృష్ణ, మల్లేష్, భీమయ్య, లక్ష్మయ్య, మోత్యానాయక్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.