కొడంగల్, అక్టోబర్ 31 : మంగళవారం మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి సమక్షంలో మండలంలోని చిట్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు నర్సింహులుగౌడ్, మంగలి నవీన్‌కుమార్, వాజీద్, బుర్ర అంజి, కృష్ణయ్య, కుమారి వెంకట్, రాములు, అబ్దుల్ రహీం, శ్రీశైలం, శీను, గిరిని శ్రీశైలం, వడ్ల రాములు, ఫకీరప్ప, శేఖర్, సాయప్ప, మౌలానా, ఇంతియాజ్, సలీం, తలారి ఫకీరప్ప, వెంకటప్ప, సాయప్ప, బిచ్చప్ప, రామప్ప, నాగేశ్, ప్రకాశ్, భీములు, జగ్గప్ప, పవన్ తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొడంగల్‌లో రోజురోజుకూ కాంగ్రెస్ ఖాళీ అవుతున్నదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధికి ఆకర్షితులై ప్రతిపక్షాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
ఎంపీపై దాడిని ఖండించిన మంత్రి
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై నిన్న జరిగిన దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చగా మారిందన్నారు. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు రెచ్చగొట్టడం, దాడులు చేయడానికి ప్రోత్సహించడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రభాకర్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని మంత్రి మహేందర్‌రెడ్డి కోరారు.
కనుమరుగవుతున్న కాంగ్రెస్
కోస్గి : కొడంగల్ నియోజకవర్గంలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ కనుమరుగుతున్నది. మంగళవారం కోస్గి మున్సిపల్లో కోనేర్ సాయప్ప, వెంకట్‌నర్సింహులు ఆధ్వర్యంలో 250 మంది ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కోనేర్ కిష్టప్ప, కోనేర్ రఘు, కోనేర్ వెంకటయ్య, రాములు, కోనేర్ పెద్ద రఘు, గండీటి యాదయ్య, బెజ్జు రాములు, టి. రాఘవేందర్, బాసీద్, మౌలానా, ప్రకాశ్, ధనపురం నర్సింహులు, మడుగు అంజిలయ్య, కాలమ్మగుడి ఖాజా, శేఖర్, భాస్కర్, నర్సింహులు, ఆనంద్, డ్రైవర్ రమేశ్, శాసం కేశవులు, కొత్త రాజప్ప, గంగాపురం వెంకట్రాములు, మడుగు శ్రీనివాస్, దేశ్‌పాండే దేవమ్మ, బండమీదిపల్లి లక్ష్మి, గండీటి యాదయ్యతోపాటు 200 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఏన్ఆర్ఈజీఎస్ స్టేట్ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి, కౌన్సిలర్లు మాస్టర్ శ్రీను, బాలేశ్, మున్సిపల్ అధ్యక్షుడు రాజేశ్, నాయకులు ఓంప్రకాశ్, కిష్టప్ప, విజయ్, శ్రీను, వెంకట్రాములు, వెంకటేశ్, నరేశ్ పాల్గొన్నారు.