‘మన ఊరు-మన బడి’ పనులను పూర్తి చేయండి
జిల్లాలో మన ఊరు-మన బడి కింద చేపట్టిన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు.
- అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాలు
వికారాబాద్, మార్చి 5 : జిల్లాలో మన ఊరు-మన బడి కింద చేపట్టిన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. మంగళవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో జరుగుతునన మన ఊరు-మనబడి పెండింగ్ పనులను పూర్తి చేయాలని, సీసీ రోడ్ల నిర్మాణ పనులు, పాఠశాలలకు అవసరమయ్యే పనులను పెండింగ్‌లో ఉంచకుండా పూర్తి చేసి ఎఫ్‌టీవో జనరేట్ చేయాలన్నారు. పాఠశాలల్లో ఇంకా ఏ ఏ పనులు మిగిలి ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఉపాధి హామీ కింద పాఠశాలల్లో చేపట్టిన పనులకు సంబంధించిన పూర్తి నివేదిక పంపాలన్నారు. ఇంజినీర్లు, డీఈ లు నిర్మాణ పనుల్లో జాప్యం చేయకుండా ప్రతి రోజూ జరగాల్సిన పనులకు ఎన్ని మిల్లర్లు, ఎంత మంది లేబర్ అవసరమో తెలుసుకుని పనులను పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ బిల్డింగ్, స్కూల్స్ ప్రహరీ, కిచెన్ షెడ్స్, టాయిలెట్స్, నిర్మాణ పనులు ఏవైతే ముందే ప్రారంభించి పూర్తి కాని పనులను సత్వరమే పూర్తి చేసి, ఎఫ్‌టీవో జనరేట్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ టెలి కాన్ఫరెన్స్‌లో ఈఈఆర్అండ్బీ, డీఈవో, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డీఈలు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

