రంగారెడ్డి, జూన్ 9 (నమస్తే తెలంగాణ)/వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆదివారం సజావుగా జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 55,692 మంది అభ్యర్థులకుగాను 41,774(75.01శాతం) మం ది పరీక్ష రాయగా.. 13,918 మంది గైర్హాజరు కాగా..వికారాబాద్ జిల్లాలోని 13 పరీక్షా కేంద్రా ల్లో జరిగిన పరీక్షకు 5,468కిగాను 4,277 మంది పరీక్ష రాయగా.. 1,191 మంది గైర్హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరు పోలీస్స్టేషన్లలో ఏర్పా టు చేసిన 7 స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య ఆయా రూట్ల వారీగా ప్రశ్నపత్రాలు, ఇతర సామగ్రిని పరీక్షా కేంద్రాలకు తరలించారు.
ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగగా.. ఎగ్జామ్ ముగిసిన అనంతరం అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, ఇతర మెటీరియల్‌ను నిబంధనలకు అనుగుణంగా సీల్ వేసి తిరిగి స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, భూపాల్ రెడ్డి, అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కోటిరెడ్డి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశా రు. అధికారులు ముందస్తుగానే విసృ్తత స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండేలా హెల్ప్డెస్లను ఏర్పాటు చేయడంతోపాటు పరీక్షా కేంద్రాల వద్ద సమగ్ర వివరాలు, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అధికారయంత్రాంగం చేపట్టిన చర్యల ఫలితంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా ప్రిలిమ్స్ పరీక్ష ముగిసింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సంజయ్‌గాంధీ మెమోరియల్ పాలిటెక్నిక్ కళాశాలతోపాటు బాలాపూర్‌లోని తీగ ల కృష్ణారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలోని కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో సాయిడెంటల్ కళాశాల, శ్రీఅనంత పద్మనాభ కళాశాల, సిద్ధార్థ జూనియర్ కళాశాలల్లోని కేంద్రాలను కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు.
విశ్వభారతి డిగ్రీ కళాశాల, గౌతమి జూనియర్ కళాశాల, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కొత్తగడిలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను అదన పు కలెక్టర్ రాహుల్‌శర్మ , పట్టణంలోని పలు పరీ క్షా కేంద్రాలను ఎస్పీ కోటిరెడ్డి సందర్శించారు. కాగా వికారాబాద్‌లోని ఎస్ఏపీ కళాశాలకు 12 మంది, విశ్వభారతికి నలుగురు, గౌతమి కళాశాలకు నలుగురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో వారిని పరీక్షా కేంద్రాల్లోకి అధికారులు అనుమతించలేదు.
ఇరువురు కలెక్టర్లు అభ్యర్థులు, సిబ్బం ది హాజరు గురించి అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్ర శ్నపత్రాలను తెరిచారా? లేదా? అన్నది నిర్ధారణ చేసుకున్నారు. బయో-మెట్రిక్ సేకరణలో ఏమై నా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకు న్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ప్రాథమిక చికిత్స వసతులతో కూడిన ఏఎన్ఎం బృం దాలు అందుబాటులో ఉన్నారా? లేదా! అని పరిశీలించారు.