వికారాబాద్, జనవరి 20 : నేటి నుంచి 24 వరకు గ్రామ సభలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. అదనపు కలెక్టర్లు సుధీర్, లింగ్యానాయక్‌లతో కలిసి సోమవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. సమావేశంలో డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో జయసుధ, డీఎస్వో మోహన్‌బాబు, పీడీ హోసింగ్ కృష్ణ, వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.