వికారాబాద్, ఏప్రిల్ 4 : జిల్లాలో సన్న బియ్యం పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. శుక్రవారం ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు సలహాలను అందజేశారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారులకు సూచించారు.
సన్న బియ్యం రవాణకు సంబంధించి కావాల్సిన అద్దె వాహనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నా రు. అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ… పభుత్వ మార్గదర్శకాల కు అనుగుణంగా సన్నబియ్యం పంపిణీలో ఎ లాంటి లోటుపాట్లకు తావివ్వకుండా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గోదాముల్లో బియ్యం కొరత లేకుండా ఎప్పటికప్పు డు నిల్వలను గమనిస్తూ, చౌక ధరల దుకాణాలకు సన్న బియ్యం సరఫరా అయ్యేలా జా గ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు, జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
తాండూరు, ఏప్రిల్ 4: మండల కేంద్రంలోని బీసీ, ఎస్సీ వసతి గృహాలను కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహాల్లోని పరిసరాలతో పాటు అక్కడి సమస్యలను నేరుగా విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందజేయాలని సిబ్బందికి సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వంట గదిని పరిశీలించారు. నాణ్యమైన సరుకులతోనే భోజనం అందించాలన్నారు. విద్యార్థుల ఆటల కోసం క్రీడా వస్తువులను అందజేస్తామన్నారు. విద్యార్థులు క్రమ శిక్షణతో చదువుకోవాలని సూచించారు. వసతి గృహం నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ తారాసింగ్, ఎంపీడీవో విశ్వప్రసాద్, ఎంపీవో సుశీల్‌కుమార్, వసతి గృహ సంక్షేమ అధికారి శ్రీశైలం ఉన్నారు.