వికారాబాద్, జనవరి 22 : దివ్యాంగులు సదరం క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 23న మధ్యాహ్నం 12 గంటల నుంచి మీసేవా కేంద్రాల్లో స్లాట్‌బుక్ చేసుకోవాలన్నారు.
నెల 24, 30, 31 తేదీల్లో తాండూరు ప్రభుత్వ దవాఖానలో జరుగనున్న క్యాంపులకు స్లాట్ బుక్ చేసుకున్న అంగవైకల్యం, బుద్ధిమాంద్యం, చెవుడు, మూగ గల వారు దరఖాస్తు చేసుకోవాలని.. అదేవిధంగా ఈనెల 27, 30 తేదీల్లో వికారాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నిర్వహించే క్యాంపులకు అంగవైకల్యం, అంధులు హాజరుకావాలన్నారు. ఈ క్యాంపులకు సదరం సర్టిఫికెట్ కాలపరిమితి దాటినవారితోపాటు కొత్తగా స్లాట్‌బుక్ చేసుకున్న వారు హాజరు కావాలన్నారు.